నియంత్రణ పేరుతో మీడియా గొంతు నులుముతున్న ప్రభుత్వం

వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా లక్ష్యంగా అక్రమ కేసులు, అరెస్టులు

సుప్రీం ఆదేశాలను కాదని సొంత రాజ్యాంగం అమలు చేస్తామంటే కుదరదు

ప్రభుత్వ తీరుపై ప్రజా పోరాటం తథ్యం

స్పష్టం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకరరావు

తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ 
జనరల్ సెక్రటరీ, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు.

సకలశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న లోకేష్

ఏ హోదాలో సోషల్ మీడియా కేసులపై సమీక్ష చేస్తారు?

వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు

టీడీపీ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు కనిపించడం లేదా?

అది సుప్రీం గైడ్ లైన్స్ అతిక్రమించడం కాదా?

వారిపై ఏం చర్యలు తీసుకున్నారు?

సూటిగా నిలదీసిన జూపూడి ప్రభాకరరావు

మీ నియంతృత్వ విధానాలను, దుర్మార్గ పరిపాలనను ఎండగడతాం.

పోరాటాలు వైయ‌స్ఆర్‌సీపీకి కొత్త కాదు

కోర్టుల ద్వారా మీ అక్రమాలను అడ్డకుంటాం

ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం 

ప్రభుత్వాన్ని హెచ్చరించిన వైయ‌స్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకరరావు

తాడేపల్లి: సోషల్ మీడియా నియంత్రణ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలు, ప్రజా స్వామ్య వాదుల గొంతు నులిమే ప్రయత్నం చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కేవలం వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఖాకీలను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు.  సోషల్ మీడియాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని గైడ్ లైన్స్ రూపొందించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సైతం కాదని... లోకేష సొంత రాజ్యాంగం అమలు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఏ అర్హతతో ఆయన సోషల్ మీడియా పై సమీక్ష చేసి ఆదేశాలు జారీ చేస్తారని ప్రశ్నించారు.  కేవలం వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, నేతలే లక్ష్యంగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్న లోకేష్ కి,  ఐటీడీపీ పేరుతో టీడీపీ సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యపోస్టులు పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న జూపూడి ప్రభాకరరావు...  టీడీపీ సోషల్ మీడియాకు మరో రకమైన చట్టాలున్నాయా?  అని నిలదీశారు.  నియంత్రణ ముసుగులో ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గదని... ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూనే ఉంటామని తేల్చి చెప్పారు. న్యాయపోరాటాల ద్వారా అక్రమ కేసులపై పోరాటం చేస్తూనే, ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
 

● ఏ హోదాలో సమీక్షించి ఆదేశాలిస్తారు?

కూటమి ప్రభుత్వ సకలశాఖ మంత్రి నారా లోకేష్ హోంమంత్రి,ఐ అండ్ పీఆర్ మంత్రితో కలిసి వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియాపై ఎలా దాడిచేయాలో దిశానిర్దేశం చేశారు. తన పరిధిని దాటి సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలని హితబోధ చేశారు. కానీ తన టీడీపీ సోషల్ మీడియా ఐ టీడీపిని మాత్రం విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు రాసుకొండి, మీ మీద ఎవ్వరూ కేసులు పెట్టరు. పెట్టినా మేం పట్టించుకోము, కానీ వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియాను మాత్రం లేకుండా చేయాలని సూచించారు. 

● సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ కాదంటూ సొంత రాజ్యాంగం...

 25 ఆగష్టు 2025 నాడు సోషల్ మీడియాపై కొన్ని గైడ్ లైన్స్ తయారు చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ తన శాఖ, తన పరిధి కాని అంశాలపై సకలశాఖా మంత్రిగా పిలవబడుతున్న లోకేష్ ఏ అధికారంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన  కొన్ని సోషల్ మీడియా గ్రూపులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తారు? మీ ఆధీనంలో ఉన్న ఐ టీడీపీ..మీ పార్టీ సోషల్ మీడియా గ్రూపుల్లో నిరంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద, వైయస్.జగన్ కుటుంబం మీద విచ్చలవిడిగా పోస్టులు పెడుతుంది. సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా ఇచ్చిన గైడ్ లైన్స్ పూర్తిగా టీడీపీకే వర్తిస్తాయి. కేవలం వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా మీదే కేసులు పెడుతూ కూటమి ప్రభుత్వం పేట్రేగిపోతుంది.కేవలం వైయ‌స్ఆర్‌సీపీ మీద మాత్రమే చర్యలు తీసుకోవాలనుకుంటున్న ప్రభుత్వానికి.. ఐ టీడీపీ పేరుతో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చేస్తున్న పోస్టుల గురించి పట్టించుకోవడం లేదు. వీరి తీరు చూస్తే గురివింద గింజ సామెత గుర్తుకు వస్తోంది. ఈ నేపధ్యంలో మీరు ఇస్తున్న ఆదేశాలు, చేస్తున్న సమీక్షలు ఇవన్నీ... సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ కి వ్యతిరేకం కాదా? ఇంత దైర్యం ఎలా చేస్తున్నారు? సుప్రీం కోర్టు ఇస్తున్న ఆదేశాలు కేవలం ప్రతిపక్షానికే వర్తిస్తాయన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

● నోరు మెదపని భాగస్వామ్య పార్టీలు...

 ఆర్టికల్ 19 ప్రకారం మీరు మాత్రమే బాగా మాట్లాడుతున్నట్టు, మిగిలిన వాళ్లు దారుణంగా మాట్లాడుతున్నట్టు మీరు ట్రీట్ చేస్తున్న విధానం సరికాదు. టీడీపీ నేతృత్వంలో ఉన్న పార్టీలను  కూటమి అనే కన్నా ముఠా అనడమే సరైదనిపిస్తోంది. కారణం ఇందులో ఉన్నవారిలో ఒక భాగస్వామి పార్టీ అస్సలు ఏం పట్టనట్టు వ్యవహరిస్తుంటే.. మరోక భాగస్వామి  ఏదైనా జరిగితే ప్రశ్నాస్తానని చెప్పి.. ముడుపులు అందుకుని మౌనంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో నిలువునా వ్యక్తులను హత్య చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదేనా మీ 40 ఏళ్ల అనుభవం చంద్రబాబు గారూ? మీ ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారు.  నియంతల్లా రాష్ట్రం మీద పడి ..మాట్లాడ్డమే తప్పు అన్నట్టు వ్వవహరిస్తున్నారు. ప్రతిదానికీ ప్రజలు, ప్రతిపక్షం, వైయ‌స్ఆర్‌సీపీ మీద, వైయస్.జగన్ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. సాక్షి మీడియాకు ఫ్రీడం ఆఫ్ స్పీచ్ వర్తించదా? మీరు రాజ్యాంగం కంటే ఉన్నతులని అనుకుంటున్నారా? 

● ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తాం...

మీరు ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కుట్రపన్ని దౌర్జన్యపూరితంగా, విచక్షణారహితంగా చేస్తున్న దాడులను కోర్టుల కీడ్చడం ఖాయం.ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదని మీరు భావిస్తున్నారా? మీరు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి, ఆయన తనయుడు కనీసం సమాచారం లేకుండా విదేశాలకు వెళ్లిపోతారు. అదే విషయం సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడతారా?  ఇదా సుప్రీం కోర్టు చెప్పింది? వైయస్.జగన్ తరపున, వైయ‌స్ఆర్‌సీపీ తరపున ఎవరూ ఏమీ మాట్లాడకూడదా? ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా? మీ ఒక్క పార్టీ మాత్రమే రాజ్యంగం ప్రకారం రిజిస్టర్ అయిందా? ప్రతిపక్ష పార్టీలు లేవా?  భావ ప్రకటనా హక్కును హరించాలనుకుంటూ... సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా.. ఆ తీర్పు ఎవరికీ తెలియదు అన్నట్టు మీరు సమీక్షలు చేసే విధానం అప్రజాస్వామికం. ఇది రాజ్యాంగ విరుద్దం. వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్, పార్టీ నిర్మాణం, మీడియా సెల్, సోషల్ మీడియాలో ఎవరినీ నిందించడం లేదు. కేవలం ప్రభుత్వ తప్పిదాలనే ఎత్తి చూపుతున్నాం. అది కూడా తప్పని భావించే కుట్రపూరిత విధానంలోకి కూటమి ప్రభుత్వం వెళ్తుంది. దీన్ని కచ్చితంగా నియంత్రిస్తాం. దీనిపై పోరాటం చేస్తాం, ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం.  ప్రజల్లోకి తీసుకెళ్తాం.

● మీ ఐటీడీపీలో అసభ్య పోస్టులపై చర్యలేవీ?

మీ దగ్గర వందలాది యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్ మీడియాల ద్వారా వైయస్.జగన్  మీద విషం కక్కుతున్న మీ ఐటీడీపీ విభాగాన్ని మూసివేయాల్సిన అవసరం ఉంటుంది. ఏఐ కంటెంట్ ను వాడుకుని అశ్లీలాన్ని సృష్టించి వైయ‌స్ఆర్‌సీపీ నేతల మీద కుటుంబాల మీద మీరు పెడుతున్నవి కనిపించడం లేదా? 
మేం సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే మాట్లాడుతున్నారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ను కూడా ఏపీలో అమలు చేయకపోతే మేం మౌనంగా ఉండాలా? మాకు సంకెళ్లు వేసి భయబ్రాంతులకు గురిచేద్దామనుకుంటున్నారా? ఈ నిర్భంధం, సంకెళ్లు వైయ‌స్ఆర్‌సీపీకి కొత్త కాదు. రాజ్యాంగ బద్దంగా మేం మాట్లాడుతూనే ఉంటాం. మేం అభ్యంతరకరంగా మాట్లాడ్డం లేదు. మీరు ఏం పరిపాలన చేస్తున్నారు? మీ నియంతృత్వ విధానాలను, దుర్మార్గ పరిపాలనను ఎండగడతాం. ఇది రాచరిక పాలన అనుకోవద్దని, ఇకపై మీ ఆటలు సాగవని జూపూడి ప్రభాకరరావు హెచ్చరించారు. కేసులు, అక్రమ అరెస్టులు ద్వారా భయపడితే వైయ‌స్ఆర్‌సీపీ భయపడదని స్పష్టం చేశారు

Back to Top