ఏలూరు జిల్లా జ‌న‌సేన నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఏలూరు జిల్లాకు చెందిన జనసేన నాయకులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. చింతలపూడి నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు బండారు గంగా సురేష్‌, ఆనెం సుభాష్‌, అలాగే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన జడ్డు దామోదర్‌ వైయ‌స్ఆర్‌సీపీ కండువా కప్పుకుని పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ వారికి పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.   ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైయ‌స్ఆర్‌సీపీ పనిచేస్తోందని, ప్రజల కోసం నిరంతరం పోరాడే పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, చింతలపూడి వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ కంభం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాధరావు, జంగారెడ్డిగూడెం వైయ‌స్ఆర్‌సీపీ నేత బీవీఆర్‌ చౌదరి తదితర నాయకులు పాల్గొన్నారు.  

Back to Top