దుర్గమ్మ పేరుతో మరో దోపిడీకి కూటమి నేతలు సిద్ధం

విజయవాడ ఉత్సవ్ పేరుతో కొత్త దోపిడీకి ప్లాన్ 

కూటమి నేతల తీరుపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 

తాడేపల్లి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమైన ప్రతిసారీ కూటమి డైవర్షన్ పాలిటిక్స్

అందులో భాగంగానే టీటీడీ పరకామణి వీడియో పేరుతో వివాదం 

చోరీకి పాల్పడ్డ రవికుమార్ ను అరెస్టు చేసిందే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ

మీ హయాంలో చోరీ చేసినా పట్టించుకోలేదు

మంత్రి లోకేష్, పాలకమండలి చైర్మన్ బీ ఆర్ నాయుడుది తప్పుడు ప్రచారం

ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ 

దుర్గమ్మ ఉత్సవాల పేరుతో కొత్త దోపిడీకి  ప్లాన్ 

విజయవాడ ఉత్సవ్ పేరుతో కోట్లాది రూపాయల దోపిడీ

ప్రభుత్వ స్థలాలు వాడుకుంటూ స్టాళ్ళకు లక్షల్లో అద్దె

కళాకారుల పేరుతోనూ భారీ దోపిడీ

బుక్ మై షో ద్వారా భారీగా టిక్కెట్ల ధరలు

కళాకారులకు, ప్రదర్శనలకు మేం వ్యతిరేకం కాదు

వారి పేరుతో జరుగుతున్న వసూళ్లపైనే మా అభ్యంతరం

ఉత్సవాల పేరుతో భారీ దోపిడీ

కోట్లాది రూపాయలు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి

కూటమి నేతలను సూటిగా నిలదీసిన వెల్లంపల్లి శ్రీనివాస్

ప్రజల కోసం ఉత్సవాలంటూ వారిపై భారం వేయడం సరికాదు

ఈ దోపిడీపై సమాధానం చెప్పాల్సిందే

ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం

తేల్చి చెప్పిన వెల్లంపల్లి శ్రీనివాస్ 

తాడేపల్లి: ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమైన ప్రతిసారి కూటమి ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్ అలవాటుగా మారిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తమ రాజకీయాలకు వేదికగా మార్చి, స్వామివారి ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగిస్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు దుర్గమ్మ పేరుతో విజయవాడ ఉత్సవ్ అంటూ కూటమి నేతలు మరో దోపిడీకి సిద్ధమయ్యారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ భూమిని ఉపయోగించుకుంటూ స్టాళ్లు పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలపై భారం మోపుతూ, దోపిడీకి పాల్పడుతున్న కూటమి నేతలు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
 
● కూటమి పాలనలో మసకబారుతున్న టీటీడీ ప్రతిష్ఠ..

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని తప్పుదోవ పట్టించేందుకు...కూటమి ప్రభుత్వం తిరుపతి ప్రతిష్టను, శ్రీ వేంకటేశ్వరస్వామి ఖ్యాతిని తగ్గించే విధంగా మరో కథను బయటకు తీసుకొచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూటమి ప్రభుత్వం కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. టీటీడీ చైర్మన్ గా బీ ఆర్ నాయుడు ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు ఆయన శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజార్చే విధంగానే వ్యవహరిస్తున్నారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెప్పుకుని... లడ్డూలో యానిమల్ ఫాట్ కలిసిందని సీఎం చంద్రబాబు పార్టీ వేదికలమీద చెప్పడం దగ్గర నుంచి ప్రతిచర్య తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించేదిగానే ఉన్నాయి. 
ముక్కోటి ఏకాదశి ఏ రోజు వస్తుందన్న విషయం ముందే నిర్ణయిస్తారు. అలాంటి రోజున కూడా సక్రమంగా వ్యవహరించకపోవడంతో దాదాపు 7 మంది భక్తులు టిక్కెట్ల కోసం తొక్కిసలాటలో చనిపోవడం దురదృష్టకరం.
 గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదు. కూటమి ప్రభుత్వంలోనే జరిగింది. నిన్నటికి నిన్న మహాలయ అమావాస్య సందర్భంగా వచ్చే భక్తులకు కూడా సక్రమంగా సౌకర్యాలు కల్పించలేని దుస్ధితిలో ఉన్నారు.

● శ్రీవాణిపై ఇప్పుడేం సమాధానం చెప్తారు..

ఇదే టీడీపీ నేతలు గతంలో శ్రీవాణి టిక్కెట్లు పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం దోచుకుంటుంది, జవాబుదారీ తనం లేదు, మేం వచ్చిన తర్వాత రద్దు చేస్తామని చెప్పారు. మా ప్రభుత్వంలో రోజుకు 1000 శ్రీవాణి టిక్కెట్లు అమ్మితే.. తాజాగా పాలకమండలి సమావేశంలో రోజుకు 2000 టిక్కెట్లు విక్రయించేలా పెంచేందుకు తీర్మానించారు. శ్రీవాణి టిక్కెట్లు విక్రయాన్నిమీరు ఎందుకు రద్దు చేయలేదు ? ఆ రోజు అవకతవకలు జరుగుతున్నాయని మీరే ఆరోపించారు, నిజంగా జరిగితే ఎందుకు భయటపెట్టలేదు? మీకెక్కడుంది చిత్తశుద్ధి? చైర్మన్ హోదాలో నోటికొచ్చినట్లు మాట్లాడ్డం మినహా మీరు చేసిందేమిటి బీ ఆర్ నాయుడు గారూ?
ఇక వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లపై మా ప్రభుత్వ హయాంలో గోల గోల చేశారు. వాస్తవానికి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీఐపీ బ్రేక్ దర్శనం 2019-29 మధ్యలో 4వేల మందికి అవకాశం ఇస్తే.. ఇప్పుడు మీరు 7500 మందికి అవకాశం ఇస్తున్నారు. ఈ లెక్కన టీటీడీ పాలకమండలి, కూటమి ప్రభుత్వం సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనానికి ఏం అవకాశం ఇచ్చింది? సామాన్యు భక్తుల సౌలభ్యం ఏం పట్టించుకుంది?

● పరకామణి పేరుతో కొత్త వివాదం...

ఇది కాకుండా ఇప్పుడు పరకామణి వీడియో పేరుతో మరో వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
వాస్తవానికి స్వామివారి పరకామణి భవనంలో అరాకొర వసతులు ఉన్నాయని, వైయస్.జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అత్యాధునిక సౌకర్యాలు, సీసీ కెమెరాలతో కొత్త భవనాన్ని నిర్మించి  దాన్ని 28-09-2022న ప్రారంభించారు. పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డిన విషయం అన్ని పత్రికల్లో ఆరోజు ప్రముఖంగా వచ్చింది. వాస్తవానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పరకామణిలో చోరీకి పాల్పడుతున్న రవికుమార్ ను పట్టుకుని లోతైన విచారణ చేసిన తర్వాత.. దర్యాప్తులో ఆశ్చర్యకరమైన వాస్తవాలు బయటపడ్డాయి. చోరికీ పాల్పడ్డ రవికుమార్ దాదాపు 20 ఏళ్లుగా ఈ చోరీలకు పాల్పడుతున్నాడని వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో విజిలెన్స్ అధికారులు బయటపెట్టారు. అనంతరం నిందితుడు రవికుమార్ కుటుంబసభ్యులతో మాట్లాడిన తర్వాత.. వారి పేరు మీద ఉన్న ఆస్తుల్లో రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రూ.14.5 కోట్ల ఆస్తులను టీటీడీకి అప్పగించాం. ఈ ఆస్తులు మార్కెట్ లో ఇంకా ఎక్కువ విలువ చేస్తాయి.
 గతంలో పరకామణిలో ఎవరైనా దొంగతనానికి పాల్పడితే వారి మీద కేసు ఫైలు చేసి జైలుకి పంపిస్తే.. మరలా బయటకు వచ్చేవారు. కానీ వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా దొంగతనానికి పాల్పడిన వ్యక్తి కుటుంబ సభ్యులను కూర్చుండబెట్టి.. స్వామివారి విశిష్టత దృష్ట్యా వారిని ఒప్పించి, ఆస్తులను స్వామివారికి అప్పగించాం. మీ ప్రభుత్వంలో ఇలా ఎప్పుడైనా చేశారా? 2023లో అప్పటి పోలీసు ఉన్నతాధికారులు, విజిలెన్స్ అధికారులు చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకుంటే... మీరు ఆ విషయాన్ని కొత్తగా కనుక్కున్నట్లు హడావుడి చేస్తున్నారు. 

●భక్తుల మనోభావాలతో చెలగాటం వద్దు...

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ.. దానిమీద విజిలెన్స్ విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశించింది. మరి ఆ రిపోర్టును ఎందుకు బయటపెట్టడం లేదు? మరలా ఇప్పుడు పరకామణి వీడియో పేరుతో హాడావుడి చేస్తున్నారు. దీనిమీద మీకు దమ్ముంటే సీబీఐ విచారణ చేయించమని మా పార్టీ నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ కూడా విసిరారు.  మీరు అధికారంలో ఉండి అనుమానాలు వ్యక్తం చేయాల్సిన పనేముంది... నేరుగా విచారణ చేయించవచ్చు కదా? దోషులుంటే వారిపై చర్యలు తీసుకొండి? అలా చేయకుండా కేవలం రాజకీయంగా వైయ‌స్ఆర్‌సీపీ నేతల మీద బురద జల్లడానికి శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఖ్యాతిని దిగజార్చే పనిచేయడం దుర్మార్గం. మంత్రి లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడనుకుంటే... సీనియర్ నని చెప్పుకునే చంద్రబాబు కూడా ఈ తరహాలో మాట్లాడ్డం దుర్మార్గం. జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఆ దేవదేవుడు చూస్తూ ఉంటాడు. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు. మా పై కోపాన్ని దేవుడి మీద చూపించవద్దు. మీ తప్పుల వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడవద్దు.

● విజయవాడ ఉత్సవ్ పేరుతో కొత్త దోపిడీకి స్కెచ్...

కేశినేని చిన్ని, కొల్లు రవీంద్రతో సహా కూటమి నేతలు తాజాగా విజయవాడ ఉత్సవ్ పేరుతో కొత్తగా దోపిడీకి తెరతీశారు. ఇప్పటికే ఇసుక, మట్టి, బూడిద వంటి సహజ వనరులను విపరీతంగా దోచుకుంటున్న కూటమి నేతలు తాజాగా విజయవాడలో దుర్గమ్మ పేరుతో మరో దోపిడీకి సిద్దమయ్యారు. దుర్గమ్మ దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత అద్భుతంగా టీటీడీ స్ధాయిలో జరుగుతాయి. అమ్మవారి అలంకారాలు  ప్రతిభక్తుడు దర్శించుకునే విధంగా గత ఐదేళ్లలో వైయ‌స్ఆర్‌సీపీ నిర్వహించింది. ఇవాళ కూటమి నేతలెవ్వరూ అమ్మవారి దసరా ఉత్సవాల మీద మాట్లాడ్డం లేదు. ఏర్పాట్లు కూడా అరాకొర వసతులతో జరుగుతున్నాయి. అధికార్ల మధ్య సమన్వయం కొరవడింది. భక్తులకు అవగాహన కలిగించే ఏర్పాట్లు లేవు. వీటి గురించి ఎంపీతో సహా ఎవ్వరూ మాట్లాడ్డం లేదు, ఇంతవరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. మా ప్రభుత్వ హయాంలో సమీక్ష నిర్వహించడంతో పాటు క్షేత్రస్ధాయిలో స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి అన్ని లోటుపాట్లను తెలుసుకుని వాటిని పరిష్కరించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కూటమి నేతలు శరన్నవరాత్రుల ఉత్సవాలను మర్చిపోయి.. దుర్గమ్మ పేరుతో విజయవాడ ఉత్సవాలను పూర్తిగా కమర్షియలైజేషన్ చేశారు. 

● ఉత్సవాల పేరుతో వసూళ్లా ?

విజయవాడ ఉత్సవాల్లో పది ఇంటూ పది సైజు స్టాల్ కోసం 56 రోజులకు రూ.3.50 లక్షలు వసూలు చేస్తున్నారు. ఉత్సవాలు నిర్వహిస్తున్న స్థలాలు పున్నమి ఘాట్, స్టేడియం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల  అన్నీ ప్రభుత్వానివే. కేవలం గొల్లపూడిలో  తీసుకున్న దేవాదాయశాఖ స్థలానికే రూ.45 లక్షల చెక్ ఇచ్చారు. దాన్ని కూడా గోల్ఫ్స్ కోర్టు పేరుతో కొట్టేయాలని చూశారు.భక్తుల తప్పు పట్టడంతో దాన్ని మార్చి ఆ స్థలానికి అద్దె కడతామని చెబుతున్నారు. మీరు 40 ఎకరాలకు రూ.45 లక్షలు కడితే.. పది ఇంటూ పది సైజు స్టాల్ కు రూ.3.50 లక్షలు వసూలు చేస్తారా ? మీరు విజయవాడ ఉత్సవాలు చేస్తున్నారా ? వ్యాపారం చేస్తున్నారా? మీ షరతులకు అంగీకరించని వ్యాపారుల మీద అధికారులతో ఒత్తిడి చేయిస్తారా? స్టాల్స్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తారా? ఉత్సవాలు పేరుతో కూటమి నేతలు వ్యాపారం చేస్తున్నారు. 

● కళా ప్రదర్శనల పేరుతోనూ దోపిడీ...

ఉత్సవాల్లో ఇళయరాజా సంగీత కచేరి నిర్వహిస్తున్నారు. దానికి బుక్ మై షో లో టిక్కెట్లు కొనుక్కోవాలని చెబుతున్నారు. ఆ షో కి రూ.849 నుంచి రూ.59 వేలు వరకు టిక్కెట్ ధర నిర్ణయించారు. సంగీత దర్శకులు ఇళయరాజా గారి మీద, ఆయన సంగీత ప్రదర్శన మీద మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆ టిక్కెటు ధర ఏంటి? మరోవైపు కార్తీక్ లైవ్ షో కోసం బుక్ మై షోలో టిక్కెట్లు విక్రయానికి పెట్టారు. ఆ టిక్కెట్లు కూడా బుక్ మై షోలో రూ.499, రూ.999 టిక్కెట్లు పెట్టారు.  కళాకారుల మీద, వారి ప్రదర్శన మీద మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ కళాకారులు, దుర్గమ్మ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. విజయవాడ ఉత్సవం పేరుతో వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా తీసుకుంటున్నారు. ఇలా పెద్ద ఎత్తున వసూలు చేస్తున్న డబ్బులు ఎవరి అకౌంట్లలోకి పోతున్నాయి. వైబ్రెంట్ విజయవాడ పేరుతో కేశినేని చిన్ని అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 
గతంలో ఎగ్జిబిషన్ సొసైటీ పేరుతో వేసవిలో పిల్లలకు ఆటవిడుపు కోసం కార్యక్రమాలు నిర్వహించేవారు. దానికి వైబ్రెంట్ విజయవాడకు సంబంధం లేదు. విజయవాడ ఉత్సవ్ పేరుతో ప్రజల నుంచి దోచుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి, ప్రజలకు ఉచితంగా ఏర్పాటు చేయాలి. మీరు  పెద్ద ఎత్తున టిక్కెట్లు అమ్ముకుంటే అది వ్యాపారం అవుతుంది. దానికి ప్రభుత్వ సహకారం ఎందుకు ఇవ్వాలి. గతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున తమన్ మ్యూజిక్ షో ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి దీనికి ఏంటి తేడా? ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? చివరకి విజయవాడ ఉత్సవాల్లో దాండియా షో కు కూడా బుక్ మై షో లో టిక్కెట్లు పెట్టారు. మేం ప్రశ్నిస్తే అడ్డుపడుతున్నామని చెబుతున్నారు. మీరు మాత్రం ఇంజనీరింగ్ కాలేజీలను బలవంతం చేస్తూ.. స్టాళ్లను ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టే.. వారి తరపున వైయ‌స్ఆర్‌సీపీ కచ్చితంగా ప్రశ్నిస్తాం. 

దుర్గమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తే వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రోత్సహిస్తుంది. భక్తులకు మంచి సౌకర్యాలు కల్పిస్తే కచ్చితంగా ఆనందిస్తాం, కానీ అవన్నీ వదిలేసి ఉత్సవాల పేరుతో డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తే కచ్చతంగా వైయ‌స్ఆర్‌సీపీ తరపున ప్రశ్నిస్తామని వెల్లంపల్లి స్పష్టం చేశారు. ఉత్సవాలను ప్రారంభించడానికి  మంత్రి నారా లోకేష్ వస్తున్నారంటే.. ఈ దోచుకున్న డబ్బుల్లో ఆయనకూ వాటాలున్నాయనిపిస్తోందన్నారు. లేని పక్షంలో ఈ దోపిడీని ఆయన ఖండించాలని తేల్చి చెప్పారు. 
చివరగా కూటమి ప్రభుత్వం తిరుపతి, విజయవాడ, అన్నవరం, సింహాచలం ఎక్కడైనా భక్తుల మనోభావాలను కాపాడే విధంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచించారు. అలా కాకుండా దేవుడి ఖ్యాతిని తగ్గించే విధంగా వ్యవహరిస్తే, దాన్ని వ్యతిరేకించడంతో పాటు ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీయడానికి వెనుకాడేది లేదని హెచ్చరించారు.

Back to Top