తాడేపల్లి: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధనాకు వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ అభినందనలు తెలిపారు. వన్డే క్రికెట్‌లో కేవలం 50 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించటంపై వైయస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. స్మృతి మంధానకు హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్టు చేశారు.