నెల్లూరు జిల్లా రోడ్డు ప్ర‌మాదంపై వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి

తాడేప‌ల్లి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతికి గుర‌య్యారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించడం అత్యంత విషాదకరమని ఆయ‌న విచారం వ్య‌క్తం చేశారు.  సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని వైయ‌స్ జ‌గ‌న్‌ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు.

Back to Top