మెడికల్ కాలేజీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు

19న చ‌లో విజ‌య‌న‌గ‌రం మెడిక‌ల్ కాలేజీ విజ‌య‌వంతం చేయాలి

వైయ‌స్ఆర్ యువ‌జ‌న విభాగం జిల్లా  అధ్యక్షుడు అల్లు అవినాష్ పిలువు

విజ‌య‌న‌గ‌రం:  మెడిక‌ల్ కాలేజీల గురించి మాట్లాడే అర్హ‌త కూట‌మి నేత‌ల‌కు లేద‌ని వైయ‌స్ఆర్ యువ‌జ‌న విభాగం జిల్లా  అధ్యక్షుడు అల్లు అవినాష్ మండిప‌డ్డారు. ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఈ నెల 19న త‌ల‌పెట్టిన ఛ‌లో విజ‌య‌న‌గ‌రం మెడిక‌ల్ కాలేజీ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న కోరారు. చ‌లో మెడిక‌ల్ కాలేజీ స‌న్నాహ‌క స‌మావేశం బుధ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆదేశాల మేర‌కు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ..  సెప్టెంబర్ 19 వ తేదీన (శుక్రవారం) విద్యార్ధి, యువజన విభాగాల ఆధ్వర్యంలో 'చలో మెడికల్ కాలేజ్' పేరుతో మన జిల్లాలోని (మన హయాంలో నిర్మించిన) విజయనగరం మెడికల్ కాలేజ్ దగ్గరకు శాంతియుతంగా పెద్ద ఎత్తున వెళ్ళి, వాస్తవ పరిస్థితులను మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు వివరించే కార్యక్రమం జరుగుతుంద‌ని చెప్పారు.  జిల్లా పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు యువజన విభాగం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, విద్యార్ధి విభాగం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా పరిధిలో ఉన్న అన్నీ అనుబంధ విభాగాలు నాయకులు, కార్యకర్తలు అభిమానులు 19వ తేదీ ఉదయం 9.00 గంటలకు జేఎన్టీయూ దగ్గర నుంచి విజయనగరం మెడికల్ కాలేజ్ దగ్గర వరకు శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్న‌ట్లు చెప్పారు.   స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ  విద్యార్ధి విభాగం జిల్లా కార్య‌ద‌ర్శి కరుమజ్జి సాయి కుమార్, చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీ కృష్ణ, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బడ్డుకొండ ప్రదీప్ నాయుడు, ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు వాకా

Back to Top