అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం 

మలమూత్రాలు,  మద్యం బాటిల్ మధ్య మహావిష్ణు విగ్రహం

క‌న్నీరు పెట్టుకున్న టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి

తిరుప‌తి: అలిపిరి పాదాల చెంత ఘెర అపచారం జరిగింది. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా  టిటిడి పాలకమండలి తీరు హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్నట్లుగా ఉంది. అలిపిరి వ‌ద్ద ఏర్పాటైన మ‌హా విష్ణు విగ్ర‌హం మ‌ల‌మూత్రాలు, మ‌ద్యం బాటిళ్ల మ‌ధ్య విరిగి ప‌డి ఉండ‌టం భ‌క్తుల‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. విష‌యం తెలుసుకున్న వెంట‌నే హుటాహుటిన సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న టీటీడీ మాజీ చైర్మ‌న్‌, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు  హిందూ సంఘాలన్నీ  వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌న్నారు.  టిటిడి చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరసగా ఘోర అపచారాలు జ‌రుగుతున్నాయ‌ని భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. విగ్ర‌హం ధ్వంసం చేసిన నిందితుల‌ను, నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Back to Top