పల్నాడు: పల్నాడు ప్రజల ఆరు దశాబ్దాల స్వప్నమైన, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వరికపూడిసెల ప్రాజెక్టుకు నవంబర్ 15, 2023న నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారని పల్నాడు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. దశాబ్దాలుగా మరుగున పడిన పల్నాటి ప్రజల చిరకాల కల వరికేపూడి శెలను తిరిగి పట్టాలెక్కించింది వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏమీ చేయని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అంతా తామే చేశామని సో షల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని పిన్నెళ్లి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. చిరకాల వాంఛ నెరవేర్చిన వైయస్ జగన్ పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. “ వైయస్ఆర్ పల్నాడు కరువు నివారణ పథకం” క్రింద… రూ. 340.26 కోట్ల వ్యయంతో వరికపూడిశెల ఎత్తిపోతల పథకాన్ని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం చేపట్టింది. కీలక అటవీ, పర్యావరణతో పాటు అన్ని అనుమతులు సాధించి 2023, నవంబర్ 15న పనులకు శ్రీకారం చుట్టాం. రూ. 340.26 కోట్ల వ్యయంతో వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు. బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 20 వేల మంది జనాభాకు వైయస్ఆర్‌సీపీ సర్కారు తాగునీరు అందించే కార్యక్రమం చేపట్టింది. పైన్‌లైన్ ద్వారా నీరందించే తొలి ప్రాజెక్టు రాష్ట్రంలో పూర్తిగా పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్ వరికెపూడిసెల ప్రాజెక్టు. 4 పంపుల ద్వారా 281 క్యూసెక్కుల నీటి సరఫరాను అందించేలా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 1.57 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 7 గ్రామాల్లోని 24.900 ఎకరాలకు సాగు నీరు.. 20,000 మంది జనాభాకు తాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం అటవీ ప్రాంతంలో పంప్ హౌస్ నిర్మాణానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, అటవీ, పర్యావరణ విభాగాల నుండి 2023 మే 19న వన్యప్రాణి సంరక్షణ అనుమతులు సాధించాం. నవంబర్ 6, 2023న అటవీ అనుమతులు పొంది వరికపూడిసెల ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నది జలాలను మళ్లించి వెనుకబడిన మెట్ట ప్రాంతాల ప్రజల కష్టాలను వైయస్ జగన్ సర్కారు తీర్చేందుకు అడుగులు వేసింది. చేతనైతే బడ్జెట్‌లో నిధులు కేటాయించండి వరికపూడిసెల ప్రాజెక్టు ఆవశ్యతకను నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దేశ ప్రధాని దృష్టికి తీసుకెళ్లి అతి కష్ట సాధ్యమైన టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీ అనుమతులు తెచ్చారని మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అన్నీ వండి పళ్ళెంలో పెడితే వరికేపూడి శెల విషయంలో తామేదో చేసినట్లు బ్రహ్మారెడ్డి సోషల్ మీడియా ద్వారా జబ్బలు చరుకుకుంటున్నడని ఎద్దేవా చేశారు. మేము ప్రాజెక్టు అన్నీ సమకూర్చామని, టీడీపీ నేతలకు చేతనైతే చంద్రబాబు కు చెప్పి బడ్జెట్ లో నిధులు కేటాయించేలా ఒత్తిడి తేవాలని సూచించారు. ఇప్పటి వరకు వరికేపూడిశెల విషయంలో బ్రహ్మారెడ్డి చేసింది జీరో అని..ఇక ముందు చేయబోయేది జీరోనే అన్నారు. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ బ్రహ్మారెడ్డి అందిన కాడికి ఆస్తులు కూడబెట్టుకుంటూ పదవి పోయక నమ్ముకున్న కార్యకర్తల్ని నట్టేట ముంచి నియోజకవర్గాన్ని వదిలి వెళ్లడం ఖాయమన్నారు.