సూప‌ర్‌సిక్స్‌లో మొట్ట మొద‌టి హామీకే దిక్కులేదు

ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫైర్‌

అమ‌రావ‌తి:  కూట‌మి ప్ర‌భుత్వం మ్యానిఫెస్టోలోని సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల్లో మొట్ట మొద‌టి హామీ నిరుద్యోగ భృతికి ఇంత‌వ‌ర‌కు దిక్కు లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్ మండిప‌డ్డారు. హామీలు అమ‌లు చేయ‌కుండానే సూపర్ సిక్స్..సూపర్ హిట్ అంటున్నార‌ని త‌ప్పుప‌ట్టారు. సోమ‌వారం శాస‌న మండ‌లిలో ఆయ‌న మాట్లాడుతూ..`కూట‌మి నేత‌లు యువతను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వ‌చ్చారు. హామీలు అమలు చేయకుండా ఏ విధంగా హిట్ అంటారు.  నిరుద్యోగంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం  మూడో స్థానంలో ఉంద‌ని కేంద్రం ఇటీవ‌ల విడుద‌ల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది.  ఇది మాట‌ల ప్రభుత్వం తప్ప..చేసింది ఏమీ లేదు` అని ర‌మేష్ యాద‌వ్ ధ్వ‌జ‌మెత్తారు.

Back to Top