ధాన్యానికి  గిట్టుబాటు ధర లేక రైతు అప్పులు పాలు

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి

నెల్లూరు జిల్లా:  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రంలో ఏ పంట‌కు  గిట్టు బాటు ధర లేక రైతు అప్పులు పాలవుతున్నార‌ని నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి విమ‌ర్శించారు. వెంకటాచలం మండలం, కాకర్ల వారి పాలెంలో రైతులు ఆర‌బోసిన ధాన్యం రాసులను ఆయ‌న ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మాట్లాడుతూ..` కూట‌మి ప్రభుత్వంలో పుట్టి ధాన్యం పదమూడు వేల నుంచి పది హేను వేల‌కు విక్ర‌యించాల్సిన దుస్థితి ఉంది. గత వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వంలో పుట్టి ధాన్యం ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేలు రేటు పలికింది. కూటమి ప్రభుత్వంలో వ‌రి రేట్లు పడిపోవడానికి కారణం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయ‌క‌పోవ‌డ‌మే. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయ‌కపోడంతో రైతులకు గిట్టుబాటు ధర లేక దళారులు చేతులో మోస పోతున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ అసెంబ్లీ వేదిక‌గా అబ‌ద్ధాలు వ‌ల్లె వేశారు. రైతులను ఆదుకోవాల‌న్న చిత్త‌శుద్ధి ఈ ప్ర‌భుత్వానికి లేదు` అని కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఫైర్ అయ్యారు. 

Back to Top