వైయస్ఆర్ జిల్లా: రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ఏ ఒక్క వర్గానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని కడప వైయస్ఆర్‌సీపీ ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. కడప నగరంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా షాహిదర్బార్ ఓనర్ మహమ్మద్ ఆజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమంలో ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్ బీ అంజాద్‌బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. `రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. గ్రామ సచివాల వ్యవస్థను పూర్తిగా నిర్వీరం చేశారు. రైతు భరోస కేంద్రాల ద్వారా రైతుకు అందాల్సిన యూరియాను అందించడం లేదు. సకాలంలో యూరియా ఎరువులు అందగా రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. గతంలో రైతులకు పెట్టుబడి సహాయం అందించేవారు. రైతులను ప్రభుత్వం ముంచుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. గ్యాంబ్లింగ్ పేకాట జూదం కూటమి నాయకులు దగ్గరుండి నడిపిస్తున్నారు` అని వైయస్ అవినాష్‌రెడ్డి ఆక్షేపించారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు సుభాన్ బాషా, డిప్యూటీ మేయర్ జమాల్ వలి, కార్పొరేటర్లు అలీ అక్బర్, చాక్లెట్ గౌస్, మొహమ్మద్ షఫీ, షంషేర్, రామకృష్ణారెడ్డి శ్రీరంజన్ రెడ్డి, మల్లికార్జున, త్యాగరాజు, అస్మతుల్లా, జిల్లా రైతు విభాగం అధ్యక్షులకు సంబటూరు ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి జయ చంద్రారెడ్డి, నాయకులు డాక్టర్ ఆస్కార్ అలీ,షఫీ,రాయల్ బాబు, వంశి, నయీమ్,ఇబ్రహీం మియా, గయాజ్, కలాం, వినోద్ కుమార్ , ఫయాజ్,సమీర్, సలీం సాహెబ్, బన్న, చాన్ అలీ, తదితరులు పాల్గొన్నారు