అనకాపల్లి: చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజా ఆస్తుల ప్రైవేటీకరణ, ముఖ్యంగా మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, అలాగే వైద్య విద్యపై తీసుకున్న నిర్ణయాలపై వైయస్ఆర్‌సీపీ చేపట్టిన పోరాటాలను కూటమి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ఇవాళ ఆందోళన చేపట్టగా..ఆయన్ను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. గణేష్‌ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా పోలీసులు సమాచారం ఇవ్వకపోవడంతో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి పోలీసులు తొత్తులగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. అరెస్టులతో భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే గణేష్ స్పష్టం చేశారు. సీఎంగా ఇన్నేళ్ల తన పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టని చంద్రబాబు.. పేదలు, మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందాలనే లక్ష్యంతో తాము నిర్మించిన కాలేజీలను ప్రైవేట్ చేతుల్లో పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.