విజయనగరం జిల్లా: రాజాం నియోజకవర్గం సంతకవిటి లో యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచి క్యూ కట్టారు. నెల రోజులుగా యూరియా కోసం పనులు మానుకొని సొసైటీలు, రైతు సేవా కేంద్రాలు, ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. యూరియా సమస్యను కూటమి ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో యూరియా పుష్కలంగా దొరికేవి, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో యూరియా అందట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.