`సాక్షి`పై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు బాధాక‌రం

 మాజీ మంత్రి శ్రీ ధర్మాన ప్రసాదరావు

శ్రీ‌కాకుళం: ప్రభుత్వం ' సాక్షి ' ఎడిటర్, జర్నలిస్టుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, నోరు నొక్కడానికి పోలీస్ యంత్రాంగాన్ని వినియోగిస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధాకరమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సాక్షి ప‌ట్ల కూట‌మి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరును ఆయ‌న తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. శ‌నివారం శ్రీ‌కాకుళంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలకు , ప్రజలకు మధ్య పత్రికలు వారధిలా పనిచేస్తాయి . ప్రభుత్వం లో జరిగే లోపాల్ని, తప్పొప్పల్ని పత్రికలూ ఎట్టి చూపుతాయి . అది వాటి బాధ్యత . ప్రభుత్వాలు. కూడా ఆ స్వేచ్ఛను కల్పిచాలి . మాకు వ్యతిరేకం గా వ్రాసిన పత్రికల నోరు నొక్కుతామని ప్రభుత్వం అనుకుంటే చివరికి అదెక్కడికి దారి తీస్తుందో ఆలోచించుకోండి . ఏ ప్రభుత్వాన్ని గాన్ని , రాజకీయ పార్టీ ని గాని కాపాడేది ప్రజాస్వామ్యం లోని స్వేచ్ఛ తప్ప నియంతృత్వం కాదు కదా ! ఇటువంటి నియంతృత్వ పోకడ లమీద భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుల్ని గుర్తు పెట్టుకోండి . ఇటువంటి అక్రమ కేసుల ఫై సుప్రీంకోర్టును ఆశ్రయించగా,2024 అక్టోబర్ లో విచారణ జరిపిన జస్టిస్ హ్రుషీకేశ్ రాయ్, జస్టిస్ ఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసిందని చెప్పారు. ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాసినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని, అలా చేస్తే భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగినట్టేనని ధర్మాసనం తెలిపిందన్నారు .భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 19 (1) ఎ ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉందని గుర్తు చేసింది సుప్రీం కోర్ట్ . తాజాగా, సాక్షిలో వచ్చిన కథనాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, కార్యాలయాల్లోకి చొరబడి జర్నలిస్టులను విచారించడం చూస్తుంటే, సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నట్టు ప్రసాదరావు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి సాక్షి మీడియాను పదేపదే లక్ష్యంగా చేసుకుని పోలీసులను దాడులకు ప్రోత్సహించడం, వేధింపులకు పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించడం చాలా చోట్ల కనిపిస్తుందని, ఇది ప్రజాస్వామ్యానికి గౌరవంకాదన్నారు . మీడియాను అణచివేసే ప్రయత్నాలు గతంలో చాలాసార్లు విఫలమైన సందర్భాలు ఉన్నాయని  వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళుతుండడం ప్రమాదకరమన్నా రు.    రాజకీయ పార్టీలు తమ తమ కోణాల్లో రాజకీయాలు చేసుకోవాలి తప్ప, మీడియా సంస్థలను, జర్నలిస్టులను పోలీసు యంత్రాంగం ద్వారా వేధించడం గతంలో  ఇంత స్థాయిలో ఏనాడూ జరగలేదన్నారు. సాక్షిపై జరుగుతున్న దాడులను, తీవ్రంగా ఖండిస్తున్నట్టు  ధర్మాన ప్రసాదరావు చెప్పారు.

Back to Top