తిరుప‌తిలో కూట‌మికి భారీ షాక్‌! 

టీడీపీ, జనసేన పార్టీల నుంచి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన ముస్లిం మైనారిటీలు

పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించిన భూమ‌న అభిన‌య్‌రెడ్డి

తిరుప‌తి:  కూట‌మి ప్ర‌భుత్వానికి తిరుప‌తి న‌గ‌రంలో ముస్లిం మైనారిటీలు భారీ షాక్ ఇచ్చారు. న‌గ‌రంలోని 36వ డివిజ‌న్‌కు చెందిన టీడీపీ, జ‌న‌సేన మైనారిటీ విభాగం నాయ‌కులు ప‌లువురు తిరుపతి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.  శ‌నివారం 35 ముస్లిం కుటుంబాలు, మ‌రో వంద మంది వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వారికి భూమ‌న అభిన‌య్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. 2029  ఎన్నిక‌ల్లో తిరుప‌తి ఎమ్మెల్యేగా అభినయ్ రెడ్డిని భారీ మెజరిటీతో గెలిపిస్తాంటున్న ముస్లిం మైనారిటీలు నిన‌దించారు.  

Image

యువ‌త ముందుకు రావాలి: అభిన‌య్‌రెడ్డి
కూట‌మి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  చేస్తున్న పోరాటాల్లో యువత ముందుండాల‌ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి పిలుపునిచ్చారు. శ‌నివారం అన్నమయ్య, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల యువజన విభాగం అధ్యక్షుల‌తో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..`పార్టీలో యువజన విభాగం పాత్ర చాల కీలకమైంది, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికపుడు ప్రశ్నించాలి. కూటమి మోసపూరిత హామీలు, ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలను పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజావ్యతిరేఖ కార్యకమాలకు దూరంగా ఉండాలని తెలియచేశారు. ప్రజలకు అండగా వుంటూ మనం చేసే కార్యక్రమాలకు పార్టీ అండగా ఉంటుంది, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వండి, పార్టీ విధి విధానాలను పాటించండి. ప్రతిపక్షం సమయంలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తనూ పార్టీ గుర్తిస్తుందని, మ‌నంద‌రికీ వైయ‌స్ జ‌గ‌న్ అండ‌గా ఉంటారు` అని భరోసా క‌ల్పించారు. స‌మావేశంలో తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశీ, అన్నమయ్య జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శివ, నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నాగార్జున, నగర యువజన విభాగం అధ్యక్షుడు దినేష్ రాయల్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మల్లం రవికుమార్, మైనారిటీ విభాగం ఇమ్రాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Back to Top