ఇది దగాకోరు, దివాళా ప్రభుత్వం 

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆగ్రహం 

తాడేపల్లి లోని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.

రాష్ట్ర చరిత్రలో ఇలాంటి సైకో ప్రభుత్వాన్ని చూడలేదు.

ఉప్పాల హారిక, రాము దంపతులుపై పాశవిక దాడి

తిరిగి రాము పైనే తప్పుడు కేసు నమోదు

పోలీసులు, ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తాం

ప్ర‌భుత్వాన్ని హెచ్చరించిన పేర్ని నాని

వైయస్ఆర్‌సీపీ సమావేశంలో టీడీపీ కార్యకర్తలకు ఏం పని

మందు, గంజాయి తాగించి ఉసిగొల్పారు

హారిక పై దాడి చేస్తుంటే పోలీసులేం చేస్తున్నారు

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలేవి

పోలీసుల తీరుపై నాని ఆగ్రహం

మంత్రి కొల్లు రవీంద్ర ఓ రాజకీయ పగటి వేషగాడు

కాసుల మూటల కోసం వేమారెడ్డి ప్రశాంతి రెడ్డి  మహాతల్లైంది 

సాటి బీసీ మహిళ మహానటి అయిందా.?

మంత్రి కొల్లు రవీంద్రపై ధ్వజమెత్తిన పేర్ని నాని

తాడేపల్లి:  రాష్ట్ర చరిత్రలో ఇంత దగాకోరు, దివాళ ప్రభుత్వం లేదని అధికార కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాని... గుడివాడలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం సందర్బంగా టీడీపీ  కార్యకర్తలు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, ఉప్పాల రాము దంపతులుపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్నా... పోలీసులు ప్రేక్షత పాత్ర వహించడంపైనా ఆయన మండిపడ్డారు. దాడికి గురైన రాముపై తిరిగి తప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులను కచ్చితంగా కోర్టుకీడ్చుతామని హెచ్చరించారు.

ఇంకా ఆయనేమన్నారంటే... 

తప్పుడు కేసులపై న్యాయస్థానాల్లో నిలబెడతాం 

జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఉప్పాల హారిక ఆమె భర్త కారులో వెనుక సీటులో కూర్చుని ఉన్నారు. ముందు సీటులో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 
కొడాలి నాని ఫ్లెక్సీ చించే క్రమంలో టీడీపీ మహిళా నేతకు దెబ్బ తగిలితే కట్టుకట్టుకున్న విజువల్స్ కూడా ఉన్నాయి. ఆమె నాని బ్యానర్ పైకి ఎగబాకి కోసే క్రమంలో దెబ్బ తగిలింది. చివరకు టీడీపీ ఛానెల్స్ లో కూడా రికార్డు అయి ఉన్నాయి. ఇవాళ కారు వెనుక సీటులో కూర్చొంటే కారుతో ఢీకొట్టారని కేసు పెట్టడం చూస్తుంటే ఇంత కన్నా దగాకోరు ప్రభుత్వం, దివాళా ప్రభుత్వం, సైకో ప్రభుత్వం చరిత్రలో ఇంత వరకు ఎక్కడా లేదు.రాముని తప్పుడు కేసులో అరెస్టు చేస్తే న్యాయపోరాటం చేస్తాం.  తప్పుడు కేసులు నమోదు చేస్తున్న పోలీసులు వాటి ద్వారా చర్యలు చేపడితే తప్పుడు కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, ప్రభుత్వాన్ని కచ్చితంగా కోర్టుకీడ్చుతాం. మా దగ్గర ఉన్న విజువల్స్  సాక్ష్యాధారాలతో సహా అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం. న్యాయస్థానాల్లో మిమ్మల్ని నిలబెడతాం. 

ముడుపులు కోసమే మహాతల్లైంది.

అత్యంత సంపన్న అగ్రవర్ణ జమీందారీ కుటుంబానికి చెందిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మహాతల్లి అని, వెనుక బడిన గౌడ కులంలో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి అగ్రవర్ణాల ఆధీనంలో ఇంత వరకు ఉన్న కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ పదవిని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అండదండలతో చేపట్టిన బీసీ మహిళ ఉప్పాల హారికని మహానటి అంటున్నారు. ఈ మాటలు కూడా హత్యకేసులో ఇరుక్కుని జైలుకెళ్లి బీసీని జైల్లో వేస్తారా అని గగ్గోలు పెట్టిన ప్రస్తుత మంత్రి కొల్లి రవీంద్ర అనడం విడ్డూరం. వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి గారి కుటుంబమే జిల్లాలో క్వార్ట్జ్ ఖనిజాన్ని ఎగుమతి చేస్తూ... మరెవ్వరినీ ఎక్స్ పోర్ట్ చేయనివ్వకుండా చేస్తున్నందుకు మైనింగ్ శాఖ మంత్రి గారికి ప్రతి వారం ముడుపులు అందుతున్నాయి. వారం వారం మూటలు అందుతున్నాయి కాబట్టి కొల్లు రవీంద్రకి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మహాతల్లి అయింది. బీసీ కులం కాబట్టి ఉప్పాల హారిక మహానటి అయింది. 

రవీంద్ర.. రాజకీయ పగటివేషగాడు 

కొల్లు రవీంద్ర కంటే రాజకీయ పగటి వేషగాడు ఆంధ్రప్రదేశ్ లో మరెవ్వరూ లేరు. 11 ఛానెల్స్ 2 పేపర్లు ద్వారా మీడియా మీద బ్రతికే రాజకీయ పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీకి డైరెక్షన్స్ కావాలి. గుడివాడలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంటే దాన్ని అడ్డుకోవాలని  బ్రాంది, గంజాయి తాగించి దారి కాయించి కర్రలు, రాడ్లుతో దాడి చేయించింది ఎవరు. 150 మంది పోలీసులు డీఎస్పీతో సహా వాళ్ల దగ్గర నిల్చుని ఎందుకు కాపలా కాస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీసులు ఏం చేయాలి. ఎందుకు వాళ్ల పాత్ర పోషించలేదు. గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు జడ్పీటీసీగా ఎన్నికై... జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అయిన ఉప్పాల హారిక తన నియోజకవర్గంలో సమావేశానికి వెళ్లకూడదా.? 
కొల్లి రవీంద్రవి సంధి ప్రేలాపనలు. మంత్రిగారి అవినీతి మీద ఆంధ్రజ్యోతిలో పుంఖాను పుంఖాలుగా వార్తలు రాస్తే.. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని నిన్ను పదవి నుంచి తప్పించమంటావా? నీ తరపున మూటల వ్యవహారాలు నడుపుతున్న ఓఎస్డీని పీకేయమంటావా? అని హెచ్చరించి.. ఓఎస్డీని తప్పించారు. రేపో మాపో కొల్లి రవీంద్రను పదవి నుంచి తప్పించడం ఖాయం. మంత్రి పదవి పోతుందన్న సంధి ప్రేలాపనలో దాన్ని కాపాడుకోవడానికి ఉచ్చం నీచం లేకుండా మాట్లాడుతున్నాడు. 

దివాళ, దగాకోరు ప్రభుత్వమిది

ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు ప్రభుత్వం. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం వాళ్లకు పట్టదు. కేవలం ఎర్రబుక్ పరిపాలనే నడుస్తోంది. అందులో కాలీ పేజీలు ఉంటే వారికి నచ్చిన వాళ్ల పేర్లు, వైయస్ఆర్‌సీపీలో యాక్టివ్ గా ఉన్న వాళ్ల పేర్లు రాసుకుంటున్నారు. ఈ కేసులకు భయపడేది లేదు. 
కృష్ణా జిల్లాలో పరిశ్రమలు స్థాపిస్తున్నామని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 నెలలుగా అసలు పరిశ్రమల శాఖకు కమిషనరే లేడు. రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తామని చెబుతున్నారు. ఇది ముమ్మూటికే దివాళకోరు ప్రభుత్వం, దొంగ కేసుల ప్రభుత్వం. తప్పుడు ప్రభుత్వం, ఎర్రబుక్ ప్రభుత్వం అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top