చంద్రబాబు మోసాలను ఎండగడదాం  

మాజీ మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌

ధ‌ర్మ‌వ‌రంలో `బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటి` కార్య‌క్ర‌మం

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా: చంద్రబాబు మోసాలను ఇంటింటా ఎండగడదామ‌ని మాజీ మంత్రి, శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షురాలు ఉషాశ్రీ చ‌ర‌ణ్ పిలుపునిచ్చారు. సోమ‌వారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి అధ్య‌క్ష‌త‌న ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్య‌క్ర‌మంపై విస్తృత స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఉషాశ్రీ చ‌ర‌ణ్ మాట్లాడుతూ..`ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలపై కచ్చితంగా నిలదీయాలి. ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం కేసు లు పెడుతోంది. రైతులను కూడా అరాచక శక్తులుగా చూపిస్తోంది. వైఎస్‌ జగన్‌పై లేనిపోని ఆంక్షలు పెడుతోంది. 40 శాతం ఓటు బ్యాంక్‌ ఉన్న వైయ‌స్ఆర్‌సీపీని తోలు తీస్తాం.. తాట తీస్తాం అంటే ఊరుకునేది లేదు. హామీలపై ప్రశ్నిస్తుంటే అన్యాయంగా కేసులు పెట్టి దాడులు చేస్తున్నా రు. చివరకు కూటమి నాయకుల కక్ష సాధింపు చర్యలకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు రాజీనామాలు చేస్తున్నారు. రానున్న జగన్‌ 2.0లో పార్టీ కార్యకర్తలే రారాజులు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా.. టీడీపీని ఎ ప్పుడు తరిమికొడదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 40 ఏళ్ల టీడీపీ పాలనలో సాధ్యం కానిది కేవలం ఒకే ఒక్క పర్యాయంలో వైయ‌స్‌ జగన్‌ చేసి చూపించారు`. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సింగారెడ్డి సతీష్ రెడ్డి , రాష్ట్ర  అధికార ప్రతినిధి, హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి,  త‌దిత‌రులు పాల్గొన్నారు

Back to Top