రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు ఉన్నాయా?

మాజీ డిప్యూటీ సీఎం పుష్ప‌శ్రీ‌వాణి ఆగ్ర‌హం

విజ‌య‌న‌గ‌రం: రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా లేదా అనే అనుమానం కలుగుతోంద‌ని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప‌శ్రీ‌వాణి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ధ్వ‌జ‌మెత్తారు. జడ్పీ ఛైర్ పర్సన్ హారిక మీద జరిగిన దాడి   పుష్పశ్రీవాణి తీవ్రంగా ఖండించారు.`ఉప్పాల హారికపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు ప్రజలకిచ్చిన వాగ్ధానాల అమలులో విఫలమై డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్‌సీపీని టార్గెట్‌ చేశారు. సూపర్‌ సిక్స్‌ పథకాల ఊసు లేదు కానీ మా పార్టీ వారిని వందల మందిని జైలు పాలు చేస్తున్నారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు. కక్షసాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో ఏడాది కాలం గడిపారు. వ్యక్తిగత కక్షలు, దాడులు, అరెస్ట్‌లు దారుణం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు` అని ఆమె హెచ్చ‌రించారు.

Back to Top