వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడిపై టీడీపీ రౌడీ హత్యయత్నం 

నాతవరం మండలంలో అధికార పార్టీ నేత దాష్టీకం

అన‌కాప‌ల్లి: నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ రౌడీ రెచ్చిపోయాడు. వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడిపై ప‌చ్చ నేత దారుణానికి ఒడిగ‌ట్టాడు. నాతవరం మండలం వైబి పట్నం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు దుంగల నరసింహామూర్తి పై టీడీపీ రౌడీ తానారి దాసు దాడికి తెగ‌బ‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు దుంగల నరసింహమూర్తి కి తీవ్ర‌గాయాల‌య్యాయి. దాడి చేసి 24 గంటలు అవుతున్న నిందితుడిని పట్టుకొని పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్న పోలీసులు.  బాధితుడు పై ఒత్తిడి చేసి కేసు వెనక్కి తీసుకోవాలని లేదంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని పోలీసులు బెదిరిస్తున్నారని బాధితుడు వాపోయాడు.

Back to Top