కూట‌మి పాల‌న‌లో ఎరువులు, పురుగు మందులు క‌రువు

విజ‌య‌న‌గ‌రం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)

విజ‌య‌న‌గ‌రం:  చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వంలో రైతుల‌కు ఎరువులు, పురుగు మందులు క‌రువ‌య్యాయ‌ని విజ‌య‌న‌గ‌రం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) మండిప‌డ్డారు.  బుధ‌వారం  విజయనగరం, ధర్మపురి శిరీ సహస్ర రేసింగ్ ప్యాలెస్ లో  మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) మీడియాతో మాట్లాడారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..`రైతులకు  ఇవాళ ఎరువులు , పురుగుల మందులు దొరకని పరిస్థితి నెలకొంది. దీనిపై ఉత్తరాంధ్రకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ఏమి చర్యలు తీసుకున్నారో .. ఏమిటో అర్థం కావడం లేదు.  మా హయాంలో సక్రమంగా నడిపిన రైతు భరోసా కేంద్రాలను ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. మా వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావలసినటువంటి ఎరువులను, పురుగు మందులను సకాలంలో అందించాం. ఆ రోజుల్లో  కియోస్క్ ద్వారా రైతులు ఇండెంటు పెట్టుకుంటే.... వారి డిమాండ్ కు తగినట్టుగా సరఫరా చేసేవాళ్లం ....ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. మా ప్ర‌భుత్వంలో రైతులకు భరోసా ఉండేది, పెట్టుబడి సాయం కూడా సకాలంలో అందించే వాళ్ళం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి ఏడాదికి సంబంధించి రైతు భరోసాను పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండో ఏడాదిలో మొక్కుబడిగా 5 వేలు ఇచ్చి తూతూ  మంత్రంగా ముగించారు.  ఒకవైపున సుమారుగా 2 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇటు చూస్తే సూపర్ సిక్స్  హామీలను పూర్తిగా గాలికి వదిలేశారు. పత్రికల్లో ప్రకటనల్లో మాత్రం సూపర్ సిక్స్ సూప‌ర్ అంటూ గొప్ప‌లు చెప్పుకుంటున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఏవి?  నిరుద్యోగ భృతి ఎక్క‌డా ? ఆడబిడ్డ నిది ఎప్పుడూ.. ?. జిల్లాలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు , అధికారులకు మధ్య పూర్తిగా సమన్వయ లోపం ఉంది. జిల్లా ప‌రిష‌త్ సర్వసభ్య సమావేశాలకు హాజరుకారు, సమస్యలపై ప్రస్తావించే చిత్తశుద్ధి వీరికి లేదు` అని మ‌జ్జి శ్రీ‌నివాస్ మండిప‌డ్డారు.  పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు ఈ నెల 9న ఆర్డీవోకు రైతు స‌మ‌స్య‌ల‌పై విన‌తిప‌త్రం అంద‌జేస్తామ‌ని ఆయ‌న తెలిపారు.  స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీఈప‌ రాష్ట్ర కార్యదర్శి కేవీ సూర్యనారాయణ రాజు(పులి రాజు)గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి వరీ నరసింహమూర్తి , జిల్లా ఉపాధ్యక్షుడు పతివాడ సత్యనారాయణ, జిల్లా పార్టీ జనరల్ సెక్రెటరీ అల్లాడ సత్యనారాయణ మూర్తి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top