6న జరగాల్సిన రైతు పోరు కార్యక్రమం 9కి వాయిదా

వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయం ప్ర‌క‌ట‌న‌
 

తాడేపల్లి: ఈ నెల 6న జరగాల్సిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పోరు కార్యక్రమం 9కి వాయిదా పడింది. రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై 6న ఆర్డీవోలకు వినతి పత్రాలు ఇవ్వాలని పార్టీ తొలుత నిర్ణయించింది. అయితే, ఈ కార్యక్రమాన్ని 9కి వాయిదా వేసినట్టు వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. 

కాగా,  రైతుల‌కు అందాల్సిన యూరియా దారిమళ్లుతోంది. రైతులకు పంపిణీ చేయాల్సిన యూరియాతో సహా ఇతర ఎరువులను టీడీపీ నేతలు బరితెగించి పెద్దఎత్తున పక్కదారి పట్టించి బ్లాక్‌మార్కెట్‌కు మళ్లిస్తున్నారంటూ మీడియాలో వస్తున్న వరుస కథనాలపై విజిలెన్స్‌ విభాగం స్పందించి వారం రోజులపాటు దాడులు నిర్వహించింది.

దీనిపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. దాడుల్లో యూరియా పెద్దఎత్తున బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోయినట్లు గుర్తించామని.. 2,845 మెట్రిక్‌ టన్నుల ఎరువులు స్వాధీనం చేసుకుని 191 కేసులు నమోదు చేశామని అధికారులు వివరించారు.  టీడీపీ నేతలు దారి మళ్లించిన యూరియా, ఇతర ఎరువులు వివిధ జిల్లాల్లోని 598 ప్రాంతాల్లో ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్నట్లు విజిలెన్స్‌ బృందాలు గుర్తించాయి. స్టాక్‌ రికార్డుల్లో లేకుండా అక్రమంగా విక్రయిస్తున్న రూ.1.83 కోట్ల విలువైన 934 మెట్రిక్‌ టన్నుల ఎరువులను సీజ్‌చేసి 67 కేసులు నమోదు చేశా­రు.

Back to Top