వైయ‌స్ఆర్‌సీపీ అనుబంధ విభాగాల్లో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ల నియామ‌కం

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్లను నియమించారు. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు ఒక ప్రెసిడెంట్‌ను నియమించారు. జోన్‌–1కి.. విశాఖ జిల్లాకు చెందిన చెన్నా జానకిరామ్‌ నియమితులయ్యారు. జోన్‌–2కి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన విప్పర్తి వేణుగోపాల్‌ నియమితులయ్యారు. జోన్‌ –3కి ఎనీ్టఆర్‌ జిల్లాకు చెందిన నట్ట యోనారాజు నియమితులయ్యారు. జోన్‌ –4కి తిరుపతి జిల్లాకు చెందిన నల్లని బాబు నియమితులయ్యారు.

 
జోన్‌ –5కి వైయ‌స్ఆర్‌ జిల్లాకు చెందిన పులి సునీల్‌కుమార్‌ నియమితులయ్యారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన ఎ.లక్ష్మీశివకుమారిని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అంగన్‌వాడీ విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా(జోన్‌ –2కు)గా, తిరుపతి జిల్లాకు చెందిన ఎస్‌.రామచంద్రారెడ్డిని రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌(జోన్‌–4)గా, తిరుపతి జిల్లాకు చెందిన దువ్వూరు మునిశేఖర్‌రెడ్డిని రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌(జోన్‌–4)గా నియమించారు.

పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా విశాఖ జిల్లాకు చెందిన ద్రోణంరాజు శ్రీవత్సవ(జోన్‌ –1), కాకినాడ జిల్లాకు చెందిన తోట రాంజీ(జోన్‌–2), ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన ఎ.రవిచంద్ర(జోన్‌–3), చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి(జోన్‌–4), అనంతపురం జిల్లాకు చెందిన వై.ప్రణయ్‌రెడ్డి(జోన్‌–5) నియమితులయ్యారు. ఎనీ్టఆర్‌ జిల్లాకు చెందిన వి.ఈశ్వర్‌ప్రసాద్‌ను రాష్ట్ర వాణిజ్య విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌(జోన్‌–3)గా నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.    

  • Document image displays YSR Congress Party logo on left with blue and white flag elements, title Yuvajana Sramika Rythu Congress Party in Telugu and English, date 24.10.2025, Telugu text describing party activities, table listing Zone as Prakasam Outer, State IT Wing Working President as S Ramachandra Reddy, District as Tirupati, additional Telugu text at bottom, contact details including phone 0863-2255522 fax and email in English.
  • Image displays YSR Congress Party logo on left with Indian flag elements party name Yuvajana Sramika Rythu Congress Party and date 24.10.2025 in Telugu script below heading in Telugu followed by table listing Zone State Anganwadi Working President District with entries Kakinada East Dr B Reddy Sent Anguri Lakshmi Shivakumar Kakinada and another row with blank fields footer includes contact details Bhuvana Murthy Tadepalli Guntur Andhra Pradesh phone numbers and email address.
  •  
Back to Top