మత్స్యకారులకు సీఎం చంద్రబాబు ద్రోహం

శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం

రెండేళ్లైనా జువ్వలదిన్నె ఎందుకు అప్పగించలేదు?

సూటిగా ప్రశ్నించిన శ్రీ వైయస్‌ జగన్‌

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గం, బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ సందర్శించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఆ తర్వాత స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో దారుణ అన్యాయాలకు జువ్వలదిన్నె ఉదాహరణ

గత ప్రభుత్వ హయాంలోనే ఫిషింగ్‌ హార్బర్‌ పూర్తి

నాడు ఎన్నికల కోడ్‌తో ప్రత్యక్ష ప్రారంభానికి వీలు కాలేదు

దాదాపు రెండేళ్లవుతున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం

మత్స్యకారుల పొట్ట కొడుతున్న సీఎం చంద్రబాబు

శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్షేపణ

రాష్ట్రంలో మత్స్యకారులందరి పక్కాగా మ్యాపింగ్‌

వారికి ఫిషింగ్‌ హార్బర్లు. తద్వారా జీవన ప్రమాణాల పెంపు

ఆ దిశలోనే ప్రత్యేకంగా 10 ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటు ప్రక్రియ

దాంతో పాటు, మరో ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లకు ప్లాన్‌

దాదాపు రూ.16 వేల కోట్లతో 4 పోర్టులు

మరో రూ.3,800 కోట్లతో 10 ఫిషింగ్‌ హార్బర్లు

ఇంకా రూ.150 కోట్లతో 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు

మొత్తంగా రూ.26 వేల కోట్లతో వాటికి శ్రీకారం

శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడి

అన్ని రకాల అనుమతులతో పోర్టుల పనుల ప్రారంభం

దాదాపు 95 శాతం ప్రాజెక్టుల పనులు పూర్తి

మూలపేట, మచిలీపట్నం పనులు 35 శాతం పూర్తి

రామాయపట్నం పోర్టు పనులు కూడా దాదాపు పూర్తి

మిగిలిన పనులెందుకు పూర్తి చేయడం లేదు?

కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన శ్రీ వైయస్‌ జగన్‌

ప్రైవేట్‌ డిఫెన్స్‌ కంపెనీకి చంద్రబాబు భూములు

జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమే కుట్ర

వచ్చేది మనందరి వైయస్సార్‌సీపీ ప్రభుత్వమే

ప్రైవేట్‌ డిఫెన్స్‌ కంపెనీని ఇక్కడ్నుంచి తరలిస్తాం

10 ఫిషింగ్‌ హార్బర్లు మత్స్యకారులకే సొంతం

శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో జరుగుతున్న దారుణ అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ ప్రాజెక్టు ఒక ఉదాహరణ అని, గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే ఫిషింగ్‌ హార్బర్‌ పూర్తి కాగా, నాడు ఎన్నికల కోడ్‌తో ప్రత్యక్ష ప్రారంభానికి వీలు కాలేదని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. జువ్వలదిన్నె ప్రాజెక్టు పూరై్త రెండేళ్లవుతున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం
మత్స్యకారుల పొట్ట కొడుతోందని ఆయన ఆక్షేపించారు. రెండేళ్లైనా ఇంకా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను ఎందుకు అప్పగించలేదని నిలదీశారు. 
    ప్రైవేట్‌ డిఫెన్స్‌ కంపెనీకి అక్కడి భూములు ఇస్తున్న సీఎం చంద్రబాబు, జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమే కుట్ర చేస్తున్నారని శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు. రాబోయేది వైయస్సార్‌సీపీ ప్రభుత్వమే అన్న ఆయన, తాము రాగానే ప్రైవేట్‌ డిఫెన్స్‌ కంపెనీని అక్కడ్నుంచి తరలిస్తామని, అలాగే 10 ఫిషింగ్‌ హార్బర్లు మత్స్యకారులకే ఇస్తామని చెప్పారు.
    శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గం, బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ సందర్శించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఆ తర్వాత స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..:

మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగు ధ్యేయం:
    రాష్ట్రంలో ఎంత ఘోరంగా అన్యాయాలు జరుగుతున్నాయనడానికి ఈరోజు ఫిషింగ్‌ హార్బర్స్‌ ఉదాహరణ. ఈ జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బరే కాదు. మా ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా ఒకేసారి 4 కొత్త పోర్టులు చేపట్టాం. రాష్ట్రంలో అంతకు ముందు 4 ప్రదేశాల్లో 6 పోర్టులు ఉంటే, కొత్తగా మరో నాలుగు పోర్టులకు శ్రీకారం చుట్టాం. 4 పోర్టులతో పాటు, అదనంగా మరో 10 ఫిషింగ్‌ హార్బర్ల పనులు కూడా చేపట్టాం. 
    రాష్ట్రంలో ఒక మ్యాప్‌ గీసి, ఎక్కడెక్కడైతే మత్స్యకారులున్నారో వాళ్లందరికీ హక్కుగా ఫిషింగ్‌ హార్బర్లు రావాలి. ఆ వాటి ద్వారా వాళ్ల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని అని చెప్పి, వాళ్ల కోసం ఎక్స్‌క్లూజివ్‌గా ఏకంగా 10 ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్‌ చేయడం జరిగింది. 

మొత్తం రూ.26 వేల కోట్లతో పనులు:
    దాదాపు రూ.16 వేల కోట్లతో 4 పోర్టులు, దాదాపు మరో రూ.3,800 కోట్లతో 10 ఫిషింగ్‌ హార్బర్లు.. ఇంకా దాదాపు రూ.150 కోట్లతో 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు.. మొత్తంగా రూ.20 వేల కోట్ల పెట్టుబడులతో ఆ పనులన్నింటికీ శ్రీకారం చుట్టాం. అవే కాకుండా అదనంగా మరో రూ.6 వేల కోట్లతో మొత్తంగా రూ.26 వేల కోట్లతో పోర్టులకు సంబంధించి విస్తరణ (ఎక్స్‌పాన్షన్‌) కూడా ప్రణాళిక కూడా సిద్ధమైంది. దేవుడి దయతో మన ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ కూడా వేగంగా అడుగులు ముందుకు పడ్డాయి.
    పోర్టులకు సంబంధించి కీలకమైన భూసేకరణలు కూడా పూర్తి చేసి అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి, ఈ పోర్టులన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, బ్యాంకు రుణాలను సైతం దీనికి టై అప్‌ చేసి, ఫైనాన్సియల్‌ క్లోజర్‌ కూడా కంప్లీట్‌ చేసి, మారిటైమ్‌ బోర్డు క్రియేట్‌ చేసి, అన్ని రకాలుగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయాం. 

అన్ని అనుమతులు. పక్కాగా ని«ధుల సేకరణ:
    రామాయపట్నం పోర్టులో దాదాపు 95 శాతం ప్రాజెక్టు కూడా పూర్తి చేయడం జరిగింది. శ్రీకాకుళంలోని మూలపేట పోర్టులో కీలకమైన భూసేకరణతో పాటు, అన్ని రకాల అనుమతులు, ఫైనాన్షియల్‌ టైఅప్‌ కూడా పూర్తి చేసి, ఆ ప్రాజెక్టులో కూడా దాదాపు 35 శాతం పనులు వేగంగా పరుగెత్తించగలిగాం. అప్పటికే పనులు మొదలయ్యాయి. బ్యాంకుల్లో డబ్బులున్నాయి. ఇక వాళ్లు పనులు చేసుకుంటూ పోతే చాలు ప్రాజెక్టుకు ఎటువంటి అభ్యంతరాలు, అవాంతరాలు లేకుండా పూర్తవుతుంది. ఆ స్టేజ్‌లోకి  వాటిని తీసుకొచ్చాం. మచిలీపట్నంలో కూడా పూర్తిగా భూసేకరణ పూర్తి చేసి, అన్ని అనుమతులూ తీసుకొచ్చి బ్యాంకులతో టై అప్‌ చేసి, లోన్లన్నీ శాంక్షన్‌ చేయించి, మారిటైమ్‌ బోర్డు ద్వారా పూర్తిగా పనులు కూడా చేసి, దాంట్లో కూడా దాదాపు 35 శాతం పనులు మన ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. కాకినాడ వద్ద ఇంకో ప్రైవేట్‌ పోర్టు కూడా వేగంగా పనులు చేయడం మొదలు పెట్టింది.
    నేను అడుగుతున్నా. ప్రైవేట్‌ పోర్టు పక్కన పెడితే మిగిలిన గవర్నమెంట్‌ రంగంలో ఉన్న 3 పోర్టుల పనులు రెండేళ్లవుతున్నా ఎందుకు జరగడం లేదు? దీనిపైనే చంద్రబాబును గట్టిగా నిలదీస్తున్నాను.
    ఇవి కాకుండా దాదాపు రూ.3,800 కోట్లతో మొదలు పెట్టిన 10 కొత్త ఫిషింగ్‌ హార్బర్లు. ఇందులో జువ్వలదిన్నె ప్రాజెక్టు.

రెండేళ్ల నుంచి ఎందుకంత తాత్సారం?:
     కాసేపటి కిందటే ఈ జువ్వలదిన్నె ప్రాజెక్టును కూడా రాష్ట్రానికి మొత్తానికి చూపించాం. ఈ ప్రాజెక్టు వైయస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా రూ.300 కోట్లు ఖర్చు చేసి, 2024 మార్చి 12న వర్చువల్‌గా ప్రారంభించడం జరిగింది. మార్చి 16న ఎన్నికల కోడ్‌ రావడంతో ఇక్కడికి వచ్చి ఫిజికల్‌గా ప్రారంభించే కార్యక్రమం వాయిదా పడింది. ఇదే ప్రాజెక్టును ఎన్నికలు అయిపోయిన తర్వాత మోదీ గారు ఆగస్టులో.. వర్చువల్‌గా ప్రారంభించారు. ఇదే జువ్వలదిన్నె ప్రాజెక్టు, అన్ని రకాలుగా పూరై్త పోయిన ఈ ప్రాజెక్టులో మత్స్యకారులందకి కూడా, ప్రత్యేకంగా ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు మన కళ్ల ఎదుటే కనిపిస్తుంది. 
    జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను నేను జాతికి అంకితం చేసి రెండేళ్లు దాటింది. ప్రధాని ప్రారంభించి కూడా ఏడాదిన్నర అవుతోంది. మరెందుకు ఈ ఫిషింగ్‌ హార్బర్‌ని మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావడం లేదు? 

శరవేగంగా పోర్టులు. హార్బర్ల పనులు:
    పక్కనే బాపట్ల జిల్లాలో నిజాంపట్నం ఫిషింగ్‌ హార్బర్‌. అందులో 62 శాతం పనులు మా ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం హార్బర్‌ పనులు కూడా దాదాపు 57 శాతం çపూర్తయ్యాయి. ఇంకా మన ప్రభుత్వ హయాంలోనే కాకినాడ జిల్లా ఉప్పాడలో మరో ఫిషింగ్‌ హార్బర్‌. ఆ పనులు కూడా మన ప్రభుత్వ హయాంలోనే 56 శాతం పూర్తయ్యాయి. ఈ 4 ఫిషింగ్‌ హార్బర్లు యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేగంగా పడుతున్న పరిస్థితులు. 
    మరోవైపు రెండో దశ కింద శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, మంచినీళ్లపేట రెండు ఫిషింగ్‌ హార్బర్లను శ్రీకారం చుట్టాం. అనకాపల్లి జిల్లాలో పూడిమడక పనులకు కూడా శ్రీకారం చుట్టాం. పశ్చిమగోదావరి జిల్లాలో బయ్యపుతిప్పలో మరో ఫిషింగ్‌ హార్బర్‌కు శ్రీకారం చుట్టాం. బాపట్ల జిల్లాలో వాడరేవు, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో రెండు ఫిషింగ్‌ హార్బర్లకు శ్రీకారం చుట్టాం. 
    ఇవి కాకుండా దాదాపు రూ.150 కోట్లతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు.. విశాఖపట్నం జిల్లా భీమిలి, విజయనగరం జిల్లా చింతపల్లి, అనకాపల్లి జిల్లా రాజులపేట, దొండవాకలో, తిరుపతి జిల్లా రాయదరువులో, కాకినాడ జిల్లా ఉప్పల్లంకలో ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. 

బాబుగారూ ఏ ఒక్క రోజైనా ఆలోచించారా?:
    నేను అడుగుతున్నా. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు, ఆ పోర్టులతో పాటు ఒక ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్, ఫిషింగ్‌ హార్బర్‌. వీటన్నింటి ద్వారా బ్లూ ఎకానమీని మత్స్యకారులకు మేలు జరిగించే విధంగా ఎకానమీని బిల్డ్‌ చేసే విధంగా శ్రీకారం చుట్టాం. 
    ఇదే చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నాను. అయ్యా చంద్రబాబుగారూ.. నువ్వు ఏరోజూ కూడా ఈ మాదిరిగా మత్స్యకారుల గురించి గానీ, రాష్ట్రం గురించి గానీ ఆలోచన చేయలేదు. ఈ మాదిరిగా పోర్టులు కట్టాలని కానీ, ఈ మాదిరిగా మత్స్యకారులకు మేలు చేస్తూ ఫిషింగ్‌ హార్బర్లు కట్టాలని కానీ, ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు కట్టాలని ఏ రోజూ ఆలోచన చేయలేదు. ఏరోజూ వాళ్లకు మంచి జరిగించే కార్యక్రమం చేయలేదు. నువ్వు ఎలాగూ చేయలేకపోతివి. కనీసం జగన్‌ చేసిన పని.. జువ్వలదిన్నెలో ఇక్కడే కనిపిస్తోంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ జువ్వులదిన్నె ప్రాజెక్టు తయారై రెండేళ్లు అవుతోంది. నేను 2024, మార్చి 12న ఈ ప్రాజెక్టును వర్చువల్‌గా జాతికి అంకితం చేస్తే, ప్రధాని మోదీగారు అదే ఏడాది, ఆగస్టులో జాతికి అంకితం చేశారు. 

ఫిషింగ్‌ హార్బర్‌. సకల సదుపాయాలు:
    ఈ ఫిషింగ్‌ హార్బర్‌లోనే కోల్డ్‌ స్టోరేజ్‌ ప్లాంట్లు, చిల్‌ రూమ్స్, ఐస్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్లు, డ్రైయింగ్‌ ప్లాట్‌ ఫామ్స్‌. ఇవే కాకుండా బోట్‌ రిపేర్‌ వర్క్‌ షాపులు, నెట్‌ మెండింగ్‌ మెషీన్లు, గేర్‌ షెడ్‌ల వంటి సదుపాయాలను కూడా అందుబాటులోకి తెచ్చాం. ప్రతి ఫిషింగ్‌ హార్బర్‌లో ఈ వసతులన్నీ ఉంటాయి. ఈ జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ ద్వారా ఏడాదికి దాదాపు 41 వేల టన్నుల మత్స్య సంపద వస్తుంది. మత్స్యకార అక్కచెల్లెమ్మలకు కూడా మంచి చేసే విధంగా వారిని ప్యాకింగ్, మార్కెటింగ్, వేల్యూ ఎడిషన్‌లో, ఫుడ్‌ స్టాల్స్‌లో పని దొరుకుతుంది. ఈ రకంగా పెద్ద ప్రణాళిక చేశాం. 

20 వేల మందిని బోట్లకు ఓనర్లను చేసే వాళ్లం:
    ఇక్కడే ఏకంగా 1250 మెకనైజ్డ్‌ బోట్లను మత్స్యకారులు హక్కుగా పొందాలని ఆరాటపడ్డాం. ఒక్కో బోటుకు 12 మంది నుంచి 15 మంది వరకు గ్రూపు చేసి వారిని ఓనర్లుగా చేయాలని భావించాం. వారు 10 శాతం చెల్లిస్తే, 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటుగా ఇస్తుంది. మిగిలిన 40 శాతం లోనుగా ఇప్పిస్తామని చెప్పాం. ఈ ఆదాయమంతా ప్రతి మత్స్యకారుడికి చెందాలి, వారి కుటుంబాలు బాగుండాలని కలలు కన్నాం. 2024లో మళ్లీ వైయస్సార్సీపీ ప్రభుత్వం కనుక వచ్చి ఉంటే మత్స్యకారులందరికీ బోట్లు అంది ఉండేవి. 1250 మెకనైజ్డ్‌ బోట్లకు దాదాపు 20 వేల మంది మత్స్యకారులు ఓనర్లు అయ్యేవారు. ఇక్కడ కోల్డ్‌ స్టోరేజ్‌ లతోపాటు ఏర్పాటు చేసిన వసతులన్నీ మత్స్యకారులకు అందుబాటులోకి వచ్చి వినియోగించుకునేవారు. ఇక్కడి మత్స్యకారులంతా సంతోషంగా జీవించే వారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల జీవితాలు ఛిన్నాభిన్నం అయిపోయాయి. 

డిఫెన్స్‌ కంపెనీని ఇక్కడి నుంచి షిఫ్ట్‌ చేస్తాం:
    ఒక ప్రైవేట్‌ డిఫెన్స్‌ కంపెనీకి చంద్రబాబు ఇక్కడ భూములు కేటాయించాడు. 79 ఎకరాల్లో సగం భూములు వారికి కేటాయించాడు. ఇదంతా మత్స్యకారులను ఇక్కడి నుంచి తరిమేసే కార్యక్రమం. మత్స్యకారుల కోసం జగన్‌ భూములు సేకరించి ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తే, చంద్రబాబు వారిని తరిమేసి ప్రైవేటు వారికిచ్చి దోచుకునే కార్యక్రమానికి తెర లేపాడు. ప్రైవేట్‌ వారికి ఇవ్వాలనకుంటే పక్కనే ఉన్న కృష్ణపట్నం పోర్టులో దండిగా భూములున్నాయి. వాటిని ఎందుకు కేటాయించడం లేదు? 
    చంద్రబాబుకి గట్టిగా వార్నింగ్‌ ఇస్తున్నా.. కళ్లు మూసి తెరిచే లోపు మూడేళ్లు పూర్తవుతాయి. మళ్లీ వచ్చేది వైయస్సార్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్‌ డిఫెన్స్‌ కంపెనీని ఇక్కడి నుంచి షిఫ్ట్‌ చేస్తాం. రాష్ట్రంలో కడుతున్న 10 ఫిషింగ్‌ హార్బర్లు మత్స్యకారుల సొత్తు. వాటిని చంద్రబాబు కాదు కదా వారి తాత కూడా వారి నుంచి లాక్కోలేరు. 

పోలీసులు సీజ్‌ చేసిన బోట్లు దొంగతనమా!:
    సీఎం చంద్రబాబు మత్స్యకారులకు మేలు చేయకపోగా వారి కడుపు మీద కొడుతున్నాడు. ఇది మన రాష్ట్ర మత్స్యకారులకు సంబంధించిన ఫిషింగ్‌ ఏరియా. ఈ ప్రాంతంలోకి పక్క రాష్ట్రాల మత్స్యకారులు ఎవరూ రాకూడదు. అందుకు సంబంధించి కఠినమైన నిబంధనలు కూడా ఉన్నాయి. అయినా వాటిని ఉల్లంఘించి తమిళనాడులోని కరైకల్‌ ప్రాంతానికి చెందిన మెకనైజ్డ్‌ బోట్లు మన ప్రాంత జలాల్లోకి ప్రవేశించి మన మత్స్యసంపదను తరలించుకు పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన మత్స్యకారులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వారికి కడుపు మండి వారే స్వయంగా రంగంలోకి దిగి ప్రాణాలకు తెగించి ఆ బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు.
    కాగా, పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సీజ్‌ చేసిన ఆ బోట్లను బీదా సోదరులు కుట్ర పన్ని దొంగతనంగా తీసుకెళ్లిపోయారు. ఇందుకు బీదా సోదరులు, ఆయన అనుచరుడు పొందూరు పోలిశెట్టి, అక్కడి బోటు యజమాని అశోక్‌ మధ్య జరిగిన సంభాషణ, వారి కాల్‌ డేటానే సాక్ష్యం. నారా లోకేష్‌ మార్చి 12న జువ్వలదిన్నెకి వస్తే, మార్చి 16న ఈ బోట్లు ఇక్కడి నుంచి తరలించుకు పోయారు. మత్స్యకారుల కడుపు కొట్టడం కోసం నారా లోకేష్, ఎంపీ, ఎమ్మెల్యే, ఇంతమంది ఏకమయ్యారు. వారు కుట్ర పన్నినట్టు కాల్‌ డేటా ఆధారాలు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నా ఒక్కరినైనా అరెస్ట్‌ చేశారా?.
    చంద్రబాబుని ఒకటే అడుగుతున్నా.. పోలీసులు సీజ్‌ చేసిన బంగారాన్ని ఎవరైనా పోలీస్‌ స్టేషన్‌ నుంచి దొంగతనంగా ఎత్తుకెళ్లిపోతే మీరు ఇలాగే విడిచిపెడతారా? మత్స్యకారులంటే ఇంత చులకనగా చూస్తున్న చంద్రబాబుకి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగదని మందలిస్తున్నా. 
ఇంత కన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచ చరిత్రలో ఇంకొకటి ఉంటుందా?.

కూటమి ప్రభుత్వం అన్నింటా విఫలం:
    చంద్రబాబుగారిని రాష్ట్రంలో ప్రతి సెక్షన్‌ కూడా చీదరించుకుంటున్న పరిస్థితి. ఎన్నికలప్పుడు సూపర్‌ సిక్స్‌లు, సూపర్‌ సెవెన్‌లు అని, బాండ్లు అని ఇంటింటికీ తిరిగి అందరినీ మోసం చేశాడు. ఎన్నికలయిపోయిన తర్వాత గత వైయస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు. ఆయన పెడతానన్న బిర్యానీ కూడా తీసేశాడు. చివరికి పలావు పోయింది. బిర్యానీ పోయింది. మరో వైపు చూస్తే.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (విద్యా దీవెన), వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితులు. మరోవైపు చూస్తే గవర్నమెంట్‌ బడులు ఇవాళ అన్యాయమైన పరిస్థితుల్లోకి పోతున్న దుస్థితి. మనం గోరు ముద్ద పథకం అమలు చేస్తే, ఈ రోజు చిన్నారులకు మంచి భోజనం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. పిల్లల చేతుల్లో ట్యాబులు కనపడాల్సిన చోట.. ఇంగ్లీష్‌ మీడియం బోధన జరగాల్సిన చోట.. ఈ రోజు నాసిరకం చదువులు అందుతున్నాయి. 
    మరోవైపు ఆరోగ్య శ్రీ పథకం పడకేసింది. లక్షలు లక్షలు కడితే తప్ప పేదవాడికి వైద్యం అందని పరిస్థితి. ఈరోజు కూడా ఇక్కడికి ఒకరు బోర్డు పట్టుకుని వచ్చారు. అన్నా నా పరిస్థితి ఇలా ఉందన్నా... మా కుటుంబ సభ్యుల పరిస్థితి ఇలా ఉందన్నా అని బోర్డు పట్టుకుని నన్ను కలసి గోడు చెప్పుకున్నాడు. అదే  మన ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శ్రీలో ఏకంగా రూ.25 లక్షలు వరకు ఉచిత వైద్యం అందించేందులా పెంచాం. 3300 ప్రొసీజర్లకు తీసుకుని పోయి, ఏ పేదవాడికి ఆరోగ్యం బాగోలేక పోయినా ఆ పేదవాడికి చిక్కని చిరునవ్వుతో వైద్యం అందించే పరిస్థితి. ఈరోజు పేదవాడికి వైద్యం అందించడానికి నెట్వర్క్‌ ఆసుపత్రులు బోర్డు తిప్పేస్తున్న పరిస్థితి. వైద్యం ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పాల్సిన పని లేదు. 
    మరోవైపు చూస్తే ఉచిత పంటల బీమా గాలికెగిరి పోయింది. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఆరోజు అక్క చెల్లెమ్మలకు అన్ని పథకాలు అందిస్తూ.. సున్నా వడ్డీ పథకం సైతం అందించాం. ఈరోజు అక్క చెల్లెమ్మలకు ఏ పథకమూ అందక.. చివరికి సున్నా వడ్డీ పథకం కూడా తీసేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్ని రకాలుగా ఈ రోజు ప్రజలు చంద్రబాబుగారిని తిడుతున్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ పెద్ద మనిషి చంద్రబాబునాయుడుగారి ప్రభుత్వాన్ని దేవుడు చూస్తూ ఊరుకోడు. ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేసే రోజులు త్వరలోనే వస్తాయి.

ఇదే.. నా భరోసా. ఫిఫింగ్‌ హార్బర్‌ మీకే:
    మీ అందరికీ భరోసా ఇస్తున్నా. కళ్లు మూసుకుని తెరిచే లోపల మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫిషింగ్‌ హార్బర్‌ మీ హక్కు. మీ హక్కుగానే ఇస్తాము. అంతే కాదు, ఈ పిషింగ్‌ హార్బర్‌ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మంచి జరిగించే విధంగా, వాళ్లందరినీ గ్రూప్స్‌ కింద ఫాం చేసి, ఒక్కొక్క బోటుకు 10, 12 మందిని యజమానులను చేస్తూ.. వాళ్లందరినీ కూడా ఇంతకు ముందు చెప్పినట్టుగా, 10 శాతం వారు కడితే చాలు, మిగిలిన 90 శాతం రాష్ట్ర ప్రభుత్వం లోన్ల కింద, గ్రాంట్లు కింద ఇస్తూ వాళ్లందరినీ ఓనర్లను చేస్తూ ఈ ఫిషింగ్‌ హార్బర్లను వాళ్లకు అంకితం చేస్తాం.

పట్టపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం:
    అదే విధంగా ఇక్కడికి వస్తూనే పాలెం మత్స్యకారులు కొంత మంది పట్టపు కార్పొరేషన్‌ కావాలని అడుతున్నారు. నాడు పేదలకు 56 కార్పొరేషన్లు అడిగిన వారికి కాదనకుండా ఇచ్చాం. మనం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పట్టపు కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నానని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

Back to Top