గుంటూరులో పేద‌ల ఇళ్ల తొలగింపు 

ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నగ‌ర అధ్య‌క్షురాలు నూరి ఫాతిమా

గుంటూరు:  న‌గ‌రంలోని మోతీలాల్ నగర్‌లో అధికారులు.. పేదల ఇళ్లు తొలగిస్తున్నారు. వందలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి పేదల ఇళ్లను అధికారులు తొలగిస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఎలా ఇల్లు తొలగిస్తారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయమని ఎమ్మెల్యే నజీర్ దగ్గరికి వెళ్తే నీచంగా మాట్లాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రైలు కిందపడి చావండంటూ సలహా ఇచ్చారని బాధితులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్‌పై బాధితులు దుమ్మెత్తి పోస్తున్నారు. 

బాధితుల‌కు నూరి ఫాతిమా ప‌రామ‌ర్శ‌
మోతిలాల్ నగర్‌లో పర్యటించిన వైయ‌స్ఆర్‌సీపీ న‌గ‌ర అధ్య‌క్షురాలు నూరి ఫాతిమా బాధితులను పరామర్శించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే ఇల్లు తొలగించాలని నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. బాధితుల సమస్యలను స‌వివ‌రంగా విన్న ఆమె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే ఇళ్లను తొలగించాలని అధికారులను కోరారు. పేదల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Back to Top