జగన్ తెచ్చిన పరిశ్రమలకు చంద్రబాబు శంకుస్థాపనలు.. 

క్రెడిట్ చోరీ'లో బాబుకు సాటిలేరు

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటు విమర్శలు

అనకాపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ  పశ్చిమ గోదావరి 
జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్.

రెన్యూ సోలార్ ప్రాజెక్టు సాధన జగన్ మార్క్.

శంకుస్థాపన చేస్కూ క్రెటిడ్ చోరీకి పాల్పడ్డం బాబు మార్క్

రెండేళ్లలో కూటమి తెచ్చిన ఒక్క పరిశ్రమ పేరు చెప్పగలరా?

జగన్ కృషినే బాబు వాడుకుంటున్నారు.

హత్యా రాజకీయాలకు పేటెంట్ చంద్రబాబుదే 

తిరిగి వైయ‌స్ఆర్‌సీపీపై ఆరోపణలు అసంబద్ధం

ఆగ్రహం వ్యక్తం చేసిన గుడివాడ అమర్నాధ్

మావిగన్ అభివృద్ధి చంద్రబాబుకు ఇష్టం లేదా? 

అమరావతి పరిధిలో 26 గ్రామాలే రాష్ట్రమా?

జగన్ ఫోబియా వీడండి.. హామీల అమలుపై శ్రద్ధ పెట్టండి.

తేల్చి చెప్పిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్

అనకాపల్లి:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తన పాత 'క్రెడిట్ చోరీ' అలవాటును బయటపెట్టుకున్నారని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీరీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అనకాపల్లి జిల్లాలో గురువారం 'రెన్యూ సోలార్' సంస్థకు సీఎం చేసిన శంకుస్థాపనపై ఆయన స్పందిస్తూ.. ఈ ప్రాజెక్టు వైయస్ .జగన్ ప్రభుత్వ కృషికి ఫలితమని స్పష్టం చేశారు. 2023 గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాలనే ఇప్పుడు చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు.

పారిశ్రామిక వేదికను పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చేలా వాడాల్సింది పోయి, వైయస్.జగన్ పై రాజకీయ విమర్శలు చేయడం బాబు దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. హత్యా రాజకీయాలకు పేటెంట్ హక్కు ఉన్న చంద్రబాబు, నేడు వైయస్. జగన్ వ్యక్తిత్వ హననానికి దిగడం విడ్డూరంగా ఉందన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో ఒక్క కొత్త పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయిన చంద్రబాబు, జగన్ ప్రతిపాదించిన 'మావిగన్' అభివృద్ధిపై ఫోబియాతో మాట్లాడుతున్నారని.. ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకుని ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే...

- జగన్ హయాం ఒప్పందమే 'రెన్యూ సోలార్'

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసిన రెన్యూ సోలార్  సంస్థ క్రెడిట్ పూర్తిగా వైయస్ జగన్ దే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. ఇప్పటి వరకు వారి పేరుమీద వచ్చిన ఒక్క కంపెనీ కూడా లేదు. రెండేళ్ల పదవీ కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఇవాళ  సీఎం శంకుస్థాపన చేసిన రెన్యూ సోలార్ సంస్థ 2023 మార్చి 3న విశాఖపట్నంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్.జగన్ నేతృత్వంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందంలో భాగంగా మన రాష్ట్రానికి వచ్చింది. అందులో భాగంగా రూ.95వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సదరు సంస్థతో ఆ రోజు ఒప్పందం చేసుకున్నాం. అనకాపల్లి, అనంతపురంతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సోలార్, విండ్ ప్రాజెక్టుల స్థాపనకు సదరు సంస్థ ముందుకొచ్చింది. సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా స్థాపిస్తామని చెప్పారు. అదే సంస్థకు ఇవాళ చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు క్రెడిట్ చోరీ మరోసారి బయటపడిందన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. 
మా ప్రభుత్వ హయాంలోనే నేను పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు 2023 జనవరి 30న ఢిల్లీలో నిర్వహించిన రోడ్ షోలో రెన్యూ పవర్ చైర్మన్ సుమన్ సిన్హా అదే వేదిక మీద నుంచి మాట్లాడుతూ  రెన్యుబుల్ పవర్ సెక్టార్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఒక దిక్సూచిగా ఉందన్నారు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మేం అంతా సుముఖంగా ఉన్నామని ప్రకటనలు చేశారు. ఈ సంస్థ ఏర్పాటుకు అవసరమైన అన్ని జీవోలను వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వమే ఇచ్చింది. ఆ కాపీలను చంద్రబాబుకు పంపడానికి సిద్ధంగా ఉన్నాం. 

- శంకుస్థాపన వేదికపై రాజకీయ విమర్శలా?..

పారిశ్రామికవేత్తలకు భరోసా ఇవ్వాల్సిన వేదికను చంద్రబాబు రాజకీయ విమర్శలకు వాడుకోవడం దుర్మార్గం. కేవలం వైయస్. జగన్ పై 'వ్యక్తిత్వ హననం' చేయడమే పనిగా పెట్టుకున్నారు.రెండేళ్ల కూటమి పాలనలో ఒక్క కొత్త కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. 

- హత్యా రాజకీయాలకు పేటెంట్ చంద్రబాబుదే..

రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు నారా చంద్రబాబే ఆద్యుడు. దశరథరామ్, వంగవీటి రంగా నుండి వైయస్ రాజారెడ్డి వరకు జరిగిన హత్యల వెనుక బాబు పాత్ర ఉంది. కడపలో దస్తగిరి హత్యతో జగన్ గారికి సంబంధం లేదని బాధితుడి భార్య చెబుతున్నా, కావాలనే బురద చల్లుతున్నారు.  ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబు పెట్టిన మానసిక క్షోభే కారణమని, ఇప్పుడు ఆయన ఫోటోకు దండేసి ఊరేగడం బాబు నైజం. 

- మావిగన్' ఫోబియా నుంచి బయటపడండి..

రాజధాని విషయంలో వైయస్. జగన్ ప్రతిపాదించిన 'ప్లాన్ బి' - మావిగన్ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) పేరు వింటేనే బాబుకు వణుకు పుడుతోంది.  కేవలం 26 గ్రామాల అభివృద్ధి కోసం రూ. 2 లక్షల కోట్లు కుమ్మరించడం కంటే, రూ. 10 వేల కోట్లతో ఇప్పటికే ఉన్న నగరాలను అభివృద్ధి చేయడం మేలు.  మావిగన్ పేరు నచ్చకపోతే మీకు నచ్చిన పేరు పెట్టుకోండి కానీ, హేళన చేయవద్దు.  

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా 'డైవర్షన్ పాలిటిక్స్' పక్కన పెట్టి వాస్తవ పాలనపై దృష్టి సారించాలని గుడివాడ అమర్నాథ్ హితవు పలికారు. పారిశ్రామిక సభలను రాజకీయ విమర్శలకు వేదికలుగా మార్చడం వల్ల రాష్ట్రానికే నష్టం జరుగుతుందని హెచ్చరించారు. గత ప్రభుత్వం తెచ్చిన పరిశ్రమలకు తన ముద్ర వేసుకోవాలని చూడటం మానుకుని, రెండేళ్ల కూటమి పాలనలో సాధించిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వైయస్.జగన్ పై తప్పుడు ఆరోపణలు చేయడం మానేసి, ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన 'సూపర్ సిక్స్' వంటి హామీలను ఎప్పటిలోగా నెరవేరుస్తారో స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Back to Top