విద్యార్థుల చేతుల్లోనే రాయ‌లసీమ భ‌విష్య‌త్తు 

రాయ‌ల‌సీమ లిఫ్టు సాధ‌న ఉద్య‌మాల‌కు సిద్ధం కావాలి 

పిలుపునిచ్చిన మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్  

చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట వేదికగా "రాయలసీమ ఎత్తిపోతల పథకం- చంద్రబాబు మోసం" పై 
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతలతో ప్రత్యేక సమావేశం

అమ‌రావ‌తి రియ‌ల్ ఎస్టేట్‌కి సీఈవోలా చంద్ర‌బాబు పాల‌న‌

నాడు పోల‌వ‌రం, నేడు అమ‌రావ‌తిని ఏటీఎంలా వాడుస్తున్నాడు

అద్దాలు బిగించ‌డానికి వేల కోట్లు ఖ‌ర్చు చేస్తారు.. రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల‌కు నిధులు లేవా? 

చంద్ర‌బాబు స్వార్థ‌రాజ‌కీయాల‌తో రాయ‌ల‌సీమ‌కు తీర‌ని అన్యాయం

రాయ‌ల‌సీమ‌ను ఎడారిగా మార‌కుండా విద్యార్థులే కాపాడాలి

వైయస్ఆర్‌సీపీ  విద్యార్థి సంఘం నాయ‌కుల‌కు సాకె శైల‌జానాథ్ దిశా నిర్దేశం

చంద్ర‌గిరి(భాక‌రాపేట‌): విద్యార్థుల చేతుల్లోనే రాయ‌ల‌సీమ భ‌విష్య‌త్తు ఆధారాప‌డి ఉంద‌ని, రాయ‌ల‌సీమ‌ సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో చంద్ర‌బాబు చేస్తున్న మోసాల‌పై విద్యార్థులు గ‌ళ‌మెత్తి ఉద్య‌మాల‌కు సిద్ధం కావాల‌ని మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్ పిలుపునిచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట వేదికగా "రాయలసీమ ఎత్తిపోతల పథకం- చంద్రబాబు మోసం" పై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతలతో జ‌రిగిన ప్రత్యేక సమావేశానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌స‌గించారు. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం పూర్తికాక‌పోతే రాయ‌ల‌సీమ ప్రాంతం ఎడారిగా మారే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి చంద్ర‌బాబు దాసోహ‌మ‌య్యాడ‌ని, 90 శాతం పూర్త‌యిన ప్రాజెక్టును రెండేళ్లుగా ప‌క్క‌న‌పెట్టేసి ఈ ప్రాంత ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో ఆడుకుంటున్నాడ‌ని వివ‌రించారు. చంద్ర‌బాబు మోసాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని విద్యార్థి విభాగం నాయ‌కులకు సూచించారు. చంద్రబాబు తానొక సీఎం అనే విష‌యాన్ని మ‌రిచి అమ‌రావ‌తి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కంపెనీ సీఈవోలా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. కేవ‌లం అద్దాలు బిగించ‌డానికి రూ. 2540 కోట్లు కేటాయిస్తున్న ప్ర‌భుత్వానికి, గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ ప్రాంతాన్ని సస్య‌శ్యామ‌లం చేసే రాయ‌ల‌సీనికి లిఫ్టు పూర్తి చేయ‌డానికి డ‌బ్బుల్లేవా అని ప్ర‌శ్నించారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే....

రేవంత్ రెడ్డికి చంద్ర‌బాబు దాసోహం
: సాకె శైలజానాథ్, మాజీ మంత్రి 

దేశంలోనే అత్యంత క‌రువుపీడిత ప్రాంతంగా ఉన్న రాయ‌ల‌సీమ మీద చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం మ‌రింత ప‌గ‌బ‌ట్టింది. సీఎం చంద్ర‌బాబు సీమ‌లో పుట్టి కూడా సీమ రైతుల ప‌ట్ల నిర్ద‌య‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. చంద్ర‌బాబు విధానాల కార‌ణంగా రాయ‌ల‌సీమ ప్రాంతం మ‌ళ్లీ ఎడారిగా మారే ప్ర‌మాదం ముంచుకొచ్చింది. రాయ‌ల‌సీమ‌కు ప్రాణాధార‌మైన రాయ‌ల‌సీమ లిఫ్టును ఆపేసి40 ఏళ్ల క్రితం అనంతపురంలో నెల‌కొన్న క‌రువు ప‌రిస్థితుల్లోకి రాయ‌ల‌సీమ‌ను తీసుకెళ్తున్నాడు. 90 శాతం పూర్త‌యిన రాయ‌ల‌సీమ లిప్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి కోసం రెండేళ్లుగా ప‌క్క‌న పెట్టేశాడు. గ్రేటర్ రాయలసీమకు చంద్రబాబు ఏవిధంగా అన్యాయం చేస్తున్నాడో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేసుకున్న‌ రహస్య ఒప్పందమే సాక్ష్యం. తెలంగాణ సీఎం రేవంత్‌కి చంద్ర‌బాబు దాసోహం అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణ సీఎంకు తాకట్టు పెట్టాడు. ఒక ముఖ్య‌మంత్రిగా అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి ఆలోచించ‌కుండా అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సీఈవోగా పనిచేస్తున్నాడు. దివంగ‌త వైయస్ఆర్‌ పోరాటం, కృషి వల్లే రాయ‌ల‌సీమ‌ల ప్రాజెక్టులు నీటితో క‌ళ‌క‌ళ‌లాడితే, ఇప్పుడు చంద్ర‌బాబు స్వార్థ‌పూరిత రాజ‌కీయాల కార‌ణంగా ఎడారిగా మారిపోయే ప‌రిస్థితులు దాపురించాయి. ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు వేసిన రాళ్లు ఇప్పుడు శిలలుగా మారిపోయాయి. 

రాయ‌ల‌సీమ‌కి చంద్ర‌బాబు తీర‌ని ద్రోహం
రాయ‌ల‌సీమకు చంద్ర‌బాబు అడుగడుగునా తీరని అన్యాయం చేస్తున్నాడు. అనంత‌పురంకి కేటాయించిన ఎయిమ్స్ ను మంగళగిరికి ఎత్తుకెళ్లిపోయాడు. కర్నూలులో నుంచి లా యూనివర్సిటీని అమరావతికి తీసుకుపోయాడు. కడప నుంచి ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంకుని అమరావతికి త‌ర‌లించాడు. సీఎం చంద్రబాబు రాయలసీమ ద్రోహి. నాడు పోల‌వ‌రాన్ని నేడు అమ‌రావ‌తిని చంద్ర‌బాబు అవినీతికి అడ్డాగా మార్చుకున్నాడు. ఆచ‌ర‌ణ సాధ్యం కాని అమ‌రావ‌తి క‌న్నా మావిగాన్ పేరుతో వైయ‌స్ జ‌గ‌న్ గారు చేసిన ప్ర‌తిపాద‌న‌తో రాష్ట్రం మ‌రింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. దోపిడీకి అవ‌కాశం లేని స‌త్వ‌ర అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంది. దాన్ని ఆమోదించ‌డానికి చంద్ర‌బాబుకి ఉన్న అడ్డంకులేంటో చెప్పాలి. రూ. 2700 కోట్లు ఇస్తే వెలుగోడు పూర్తవుతుంది. రూ. 15వేల కోట్లతో సీమ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి. కానీ వాటి గురించి ప‌ట్టించుకోకుండా రూ. 2540 కోట్లతో స‌చివాల‌యానికి మయసభ మాదిరే అద్దాలు బిగిస్తారట‌. మింగ మెతుకు లేదు కానీ ఆడంబ‌రాల కోసం వేల కోట్లు అప్పులు చేస్తున్నారు. లిఫ్టులు పెట్టి మ‌రీ నీటిని త‌ర‌లించాల్సిన రాజ‌ధాని దేశంలో మొద‌టిది, చివ‌రిది అమ‌రావ‌తే కావొచ్చు. ఊర్లో నుంచి నదిలోకి నీళ్లు ఎత్తి పోయడం అమరావతిలోనే చూస్తున్నాం. 

చంద్ర‌బాబుకి ఏటీఎంలా అమ‌రావ‌తి
పోల‌వ‌రం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని ప్రధాని మోదీ చెప్పారు. గోదావరి నుంచి బనకచర్లకి నీరు తెస్తాను అంటాడు చంద్రబాబు. శ్రీకాకుళం నుంచి అనంతపురకు నీళ్లు ఇస్తాము అంటూ చంద్రబాబు మోసపూరిత కబుర్లు చెప్ప‌డం సిగ్గుచేటు.  రాయలసీమకు తీరని అన్యాయం జరగబోతుంది. మళ్ళీ జొన్న రొట్టె తినే పరిస్థితి వస్తుంది. మంత్రులకు ఇసుక దోపిడీపైన ఉన్న ప్రేమ రైతుల మీద లేదు. రైతుల‌కు నాణ్య‌మైన విత్త‌నాలు, ఎరువులు, యూరియాలు అందించాల‌ని లేదు. చంద్ర‌బాబు కూటమి ప్ర‌భుత్వంలో రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ లేదు. స్పెషల్ స్టేటస్ లేదు. క‌నీసం సాగు నీరు కూడా లేని సంక్షోభం రాబోతుంది.  

ఉద్య‌మాల‌కు విద్యార్థులు సిద్ధం కావాలి
రాయ‌ల‌సీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం రాయలసీమ విద్యార్థి విభాగం ముందుండి పోరాటం చేయాలి. రాయ‌ల‌సీమ భ‌విష్య‌త్తు విద్యార్థులు, యువ‌త చేతుల్లోనే ఉంది. విద్యార్థుల పోరాటాల‌కు వైయస్ఆర్‌సీపీ అండ‌గా ఉంటుంది. మీ కాలి కింద మా చేతులు ఉంటాయి. ఏ కష్టం రాకుండా మేము అండగా ఉంటాం. మా బిడ్డల్లాగే మిమ్మల్నీ కాపాడుకుంటాం. రాబోయే రోజుల్లో చంద్రబాబు లెక్కలు వడ్డీలు, చక్రవడ్డీ, బారు వడ్డీతో సహా సరిచేస్తాం. గ్రేటర్ రాయలసీమలో యుద్ధం మొదలు పెడితే విజయంతోనే ముగిస్తారు. రాబోయే రోజుల్లో వైయ‌స్ జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావ‌డం త‌థ్యం. రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డం ఖాయం. 
 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి శైలజానాథ్, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, విద్యార్థి వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రణయ్ రెడ్డి, ఏ.రవిచంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు. వారితోపాటు నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూల్, నంద్యాల, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు.

Back to Top