కావ‌లిలో ఘ‌నంగా అంబేద్కర్ జయంతి వేడుక‌లు

నెల్లూరు జిల్లా: డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా కావ‌లి మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ ఇంచార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం వద్ద ఉన్న పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని, సామాజిక న్యాయం సాధనలో ఆయన చూపిన దారిలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు.
 

Back to Top