కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్న నగర్ కాలనీ 5వ వార్డులో తీవ్ర మంచినీటి కొరత నెలకొని స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య తీవ్రతను గుర్తించిన వైయస్ఆర్‌సీపీ నాయకులు, మాజీ ఎంపీ బుట్టా రేణుక వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ సమస్యను వైయస్ఆర్‌సీపీ జిల్లా చేనేత అధ్యక్షులు ఎంకే శివప్రసాద్, 5వ వార్డు కన్వీనర్ ఉమ పరిశీలించి, కర్నూల్ పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న బుట్టా రేణుక తక్షణమే స్పందించి, తన భర్త, బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠకు వివరించారు. సేవా దృక్పథంతో ముందుకు సాగే బుట్టా శివ నీలకంఠ వెంటనే చర్యలు తీసుకుని, బుట్టా ఫౌండేషన్ తరఫున శివన్న నగర్ కాలనీకి మంచినీటి ట్యాంకర్లను పంపించారు. దీంతో కాలనీవాసులకు తక్షణ ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ, బుట్టా కుటుంబం ఎల్లప్పుడూ ప్రజల సమస్యలపై స్పందిస్తూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అవసర సమయంలో వెంటనే సహాయం అందించడం ద్వారా బుట్టా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి, మరెంతో మందికి ఉపయోగపడాలని కాలనీవాసులు ఆకాంక్షించారు.