కురుపాంలో పదవీకాలం పూర్తి చేసిన సర్పంచులకు ఘన సన్మానం  

పార్వ‌తీపురం జిల్లా: కురుపాం నియోజకవర్గంలో పదవీకాలం పూర్తి చేసుకున్న సర్పంచులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాభివృద్ధికి కృషి చేసిన ప్రజాప్రతినిధుల సేవలను గుర్తిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, మాజీ డిప్యూటీ సీఎం పుష్ప‌శ్రీ‌వాణి, పార్టీ జిల్లా అధ్య‌క్షుడు ప‌రిక్షిత్‌రాజు ఆధ్వ‌ర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్ప‌శ్రీ‌వాణి మాట్లాడుతూ, సర్పంచులు తమ పదవీకాలంలో గ్రామాల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ప్రశంసించారు. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సర్పంచుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సర్పంచులు, వైయ‌స్ఆర్‌సీపీ మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  

Back to Top