తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అవినీతి, అత్యాశ వల్ల అమరావతి మోయలేని గుదిబండగా మారిందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సోమవారం పేర్నినాని తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఏపీ రాజధాని అంశంలో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.‘మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే ఇబ్బంది ఏంటి? బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారు. చంద్రబాబు అంతులేని అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. రాష్ట్రానికి రాజధాని అనేది సిరిసంపదలతో తూగేలా ఉండాలి. అంతేగానీ, రాష్ట్రాన్ని దివాళా తీసే విధంగా రాజధాని ఉండకూడదు. ఏది బాగుంటుందో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆలోచించే పరిస్థితి వచ్చింది. మావిగన్ అనే ప్రతిపాదనతో రాజధాని తక్కువ ఖర్చుతో నిర్మితమవుతుంది. ప్రజలు అమాయకులేం కాదు.. అన్నీ ఆలోచిస్తారు. చంద్రబాబుకు విశ్వాసం లేదని ఎన్టీఆర్ విమర్శించారు. 224 మంది ఎమ్మెల్యేలను కాసులతో కొనుక్కున్నారని ఎన్టీఆర్ అన్నారు. వెన్నుపోటు పొడిచారని స్వయంగా ఎన్టీఆరే అన్నారు. కేబినెట్‌లో ఉన్న తొమ్మిది మంది మంత్రులే చంద్రబాబును తిట్టని తిట్టు తిట్టారు’ అని పేర్ని నాని అన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు: - చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు, అంతులేని అవినీతి, అత్యాశల కారణంగా అమరావతి అనేది రాష్ట్రానికి మోయలేని గుదిబండగా మారింది. - రాజధాని నిర్మాణం పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు దివాళా తీయించే మార్గంలోకి నడిపిస్తున్నాడు. - వైయస్ జగన్ గారి మావిగన్ ప్రతిపాదనను ఎందుకు తిరస్కరిస్తున్నారో ఇంతవరకు కూటమి నాయకులు చెప్పలేకపోయారు - నేరుగా సమాధానం చెప్పుకోలేక మంత్రులకు బూతు పాఠాలు రాసిచ్చి, పచ్చి అబద్ధాలు చెప్పించి వైయస్ జగన్ పై వ్యక్తిత్వ హననం చేశారు. - మావిగన్ అంశాన్ని డైవర్టు చేస్తున్నామనే భ్రమల్లో బూతులు, అబద్ధాలతోనే కూటమి నాయకులంతా మావిగన్ కాన్సెప్టును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. - ఆ విధంగానే ఇన్నాళ్లూ వాళ్లు చేసిన పాపాలను కడుక్కునే ప్రయత్నం చేశారు. - మంత్రి అచ్చెన్నాయుడు చంద్రబాబుకి బూతు బంట్రోతుగా మారిపోయాడు. - 73 ఏళ్ల వయసులో చంద్రబాబుని ఎన్టీఆర్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఆయన్ను ఔరంజేబుతో పోల్చాడు. - ఆయనతో పార్టనర్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబుని అవినీతిపరుడిగా పేర్కొన్నాడు. ఆయన్ను గెలిపిస్తే అవినీతిని ప్రోత్సహించేనట్టేనని ప్రకటన చేశాడు. - చంద్రబాబు కేబినెట్‌లో ఉన్న సగం మంది మంత్రులు ఒకప్పుడు ఆయన్ను తిట్టిన వీడియోలు చాలా ఉన్నాయి. 164 మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబుని తిట్టిన వారి లెక్క వందకి పైనే. - చంద్రబాబుని మోడీ, మోడీని చంద్రబాబు దూషించుకున్నారు. - చంద్రబాబుని దగ్గుబాటు పురందీశ్వరి ఎన్నిసార్లు తిట్టిందో లెక్కే లేదు. - తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా చంద్రబాబు గురించి పుస్తకాలే రాశాడు. టార్చ్‌లైట్ మినిస్టర్ అని పేరు కూడా పెట్టాడు. - దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలను టీడీపీ శిక్షణ తరగతుల్లో పంచి పెట్టగలరా? - చంద్రబాబు రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలి. చేయాలి. అప్పుడే అందరికీ మంచిది.