వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ మెంబ‌ర్‌గా పాముల పుష్ప శ్రీవాణి

పార్టీ పదవుల్లో మరికొందరు నాయకుల నియామకం

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కమిటీల్లో వివిధ హోదాల్లో పలువుర్ని నియ మించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణిని పార్టీ పీఏసీ మెంబర్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మేడపాటి షర్మిలారెడ్డిని స్టేట్ సెక్రటరీ(పార్లమెంట్)గా, గుంటూరుకు చెందిన వి.ప్రజ్ఞాధర్రెడ్డిని కో-ఆర్డినేటర్ మీడియా కమ్యూనికేషన్(న్యూ ఢిల్లీ)గా, విశాఖపట్నం జిల్లాకు చెందిన డాక్టర్ ఎం.నాగమల్లేశ్వరిని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Back to Top