వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 21వ తేదీనుంచి మూడు రోజులపాటు వైయస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 21వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2.30గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి బెంగుళూరు ఎయిర్‌డ్రోంకు బయలుదేరుతారు. అక్కడి నుంచి 3గంటలకు హెలీకాప్టర్ ద్వారా బయలుదేరి 3.40గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 4గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్‌కు చేరుకుంటారు. 4 నుంచి రాత్రి 7గంటల వరకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్‌లో ప్రజలతో మమేకమవుతారు. 22వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైయస్ఆర్‌సీపీ నేత దివంగత సుధాకర్‌రెడ్డి ఇంటికి బయలుదేరుతారు. 9.45గంటలకు సుధాకర్‌రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 10.15గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11గంటలకు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి రాత్రి 6.25గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 23వ తేదీ గురువారం ఉదయం 8గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి హెలీప్యాడ్‌కు రోడ్డు మార్గాన వైయస్ జగన్ బయలుదేరుతారు. అనంతరం అక్కడి నుంచి హెలీకాఫ్టర్ ద్వారా బెంగళూరుకు తిరగుపయనమవుతారు.