రావులపాలెంలో టీడీపీకి షాక్…

వైయ‌స్ఆర్‌సీపీలోకి భారీగా చేరికలు 

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చిర్ల జగ్గిరెడ్డి 

రావులపాలెం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం సోమసుందర్ రెడ్డి నగర్‌లో టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీ లో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది కార్యకర్తలు పార్టీ కండువా కప్పించుకుని వైయ‌స్ఆర్‌సీపీ లోకి చేరారు. ఈ సందర్భంగా చేరిన కార్యకర్తలు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజల సమస్యలను పట్టించుకోని పాలనపై అసంతృప్తితోనే పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ విధానాలు,  వైయ‌స్ జ‌గ‌న్‌ నాయకత్వంపై విశ్వాసంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ పాల్గొని, చేరిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా మానుపాటి పోసి, మానుపాటి అజయ్, మానుపాటి ఏడుకొండలు, కోసూరి వంశీ, మానుపాటి వంశీ, కావడి అనిల్, కావడి సునీల్, ఈతకోట శివ, ఎస్‌కే ఖలీద్, గొలుగూరి బాలు, మహేష్, హేమంత్, కిరణ్ తదితరులు పార్టీలోకి చేరారు. అనంతరం సోమసుందర్ రెడ్డి నగర్‌లో వైయ‌స్ఆర్ యూత్ ఏర్పాటు చేసిన పార్టీ జండా స్థూపాన్ని ప్రారంభించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అలాగే వైయ‌స్ జగన్ ,  చిర్ల జగ్గిరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి ముందు వైయ‌స్ఆర్ యూత్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చిర్ల జగ్గిరెడ్డి, పాటి శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చిన జగ్గిరెడ్డి, రాబోయే రోజుల్లో జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

Back to Top