అమరావతి సాధ్యం కాదని తెలిసీ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నాడు

చివరకు రాష్ట్రానికి ఏ రాజధానీ లేకుండా చేస్తున్నాడు

ప్రజలకు మేలు చేయాలని కాదు, స్కాములు చేయాలన్నదే బాబు ఉద్దేశం

జగన్‌ మావిగన్‌ ప్రతిపాదనతో చంద్రబాబు, టీడీపీలో కలవరం

అందుకే చంద్రబాబు, ఆయన మంత్రుల తిట్ల దండకం

మావిగన్‌ తోనే అభివృద్ధి సాధ్యం 

స్పష్టం చేసిన మాజీ మంత్రి పేర్ని నాని

బాబు స్కాముల కోసం అమరావతి రూపంలో ప్రజలపై లక్షల కోట్ల అప్పుల భారం

అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, నీళ్లు కోసమే రూ.2 లక్షల కోట్లు

అందులో 10 శాతం ఖర్చుతో అయ్యే ‘మావిగన్’ వద్దంటారా? 

మావిగన్‌ వద్దంటున్నారంటే మిమ్మల్ని మించిన తుగ్లక్‌ మరొకరు లేరు

చంద్రబాబు, నారాయణల మానసిక స్థితిపై వైద్యుడ్ని సంప్రదించండి

మావిగన్‌పై ప్రజల్లో విస్తృతంగా చర్చ 

వైయ‌స్ఆర్‌సీపీని బదనాం చేయాలనే తప్పుడు ఉద్దేశంతో చంద్రబాబు మావిగన్‌పై పదేపదే నెగెటివ్‌ ప్రచారం 
చేయించారు

చంద్రబాబు విస్తృత ప్రచారం వల్ల మావిగన్‌ ప్రజలకు వేగంగా చేరింది

ఇప్పుడు అమరావతిపై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు

అమరావతిలో చంద్రబాబు అవినీతిని ప్రజలు కడిగిపారేస్తున్నారు

సీఆర్డీయేలో గుంటూరు, విజయవాడ ఉందని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?

అమరావతి వెలుపల ఒక్కపైసా అయినా ఖర్చు చేశారా? 

విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాలపై దృష్టి ఉంటే ఇలా చేస్తారా? 

ఇప్పటికీ సీఆర్డీయేకు మాస్టర్‌ ప్లాన్‌ లేదు కదా

జగన్‌ గారు మావిగన్‌ అనగానే ఇప్పుడు హడావిడి మొదలుపెట్టారు 

అమరావతిలో ఎకరం రూ.10 కోట్లు అంటూ ప్రచారాలు

అలా అయితే చంద్రబాబు తన ఇంటికి కొన్న స్థలం ఎకరా దాదాపుగా రూ.3.63 కోట్లు

ఐదు ఎకరాల్లో 25 వేల గజాల్లో చంద్రబాబు ఇల్లు కట్టుకున్నా ఎల్లోమీడియాకు అది పూరి గుడిసెలాగే కనిపిస్తోంది

మరి నారాయణ చెప్పే రూ. 10 కోట్లు పచ్చి అబద్ధం కాదా?

అమరావతిలో ఎకరా రూ.20 కోట్లు ఎప్పుడు అవుతుందో మంత్రి నారాయణ చెప్పగలరా?

సూటిగా ప్రశ్నించిన పేర్ని నాని

అమరావతి పేరుతో విచ్చలవిడిగా అప్పులు చేస్తే రాష్ట్రంలో ప్రజల గతి ఏం కాను 

అమరావతిలో లక్ష ఎకరాల్లో కనీస సదుపాయాలకే రూ.2 లక్ష కోట్లు 

ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పనులు, కార్యక్రమలు ఏమవుతాయి?

ఈ రెండేళ్లలో చంద్రబాబు తెచ్చిన రూ.3.57లక్షల కోట్ల అప్పు ఏమైంది? ఎవరి జేబులోకి వెళ్లింది

మా పథకాలు రద్దు చేశారు ,చంద్రబాబు సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌కు దిక్కులేదు 

ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వక విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నారు 

రూ.1200 కోట్లు విడుదల చేస్తానని అసెంబ్లీ సమావేశాలకు ముందు లోకేష్‌ ట్వీట్లు, ఆడబ్బే ఇంకా రాలేదు  

ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేశారు

ఆడబిడ్డ నిధికి అతీగతీ లేదు

సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంతా పచ్చి మోసం.

జాడ లేని నిరుద్యోగ భృతి? 

రూపాయి ఇవ్వకుండా యువతకు వంచన

నాడు-నేడు పనులు నిలిపివేత

ప్రభుత్వ బడులు, ఆస్పత్రులపై కూటమి కక్ష

ఆస్పత్రుల్లో మందులు, దూదికి కూడా దిక్కులేదు

అమరావతికి రూ.2 లక్షల కోట్లు అప్పులు చేస్తే ఇక ప్రజల సంగతి అంతే.

మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారు

అమ్మకం దిశగా ఫిషింగ్ హార్బర్లు

మత్స్యకారుల పొట్ట కొడుతున్న చంద్రబాబు.

మూలన పడ్డ మూడు పోర్టుల నిర్మాణం

రాష్ట్ర ప్రయోజనాలు గాలికొదిలిన చంద్రబాబు 

పేర్ని నాని తీవ్ర ఆక్షేపణ 

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు తన అనాలోచిత నిర్ణయాలతో అప్పుల ఊబిలోకి నెట్టి, భవిష్యత్ తరాల భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని అమరావతి అనేది రాష్ట్రానికి మోయలేని గుదిబండగా మారిందని ధ్వజమెత్తారు.

గడిచిన రెండేళ్లలో రూ. 3.57 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా..  రాష్ట్రంలో సంక్షేమం సంతకెళ్లిందని, అభివృద్ధి అడ్రస్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. వైయస్. జగన్  ప్రతిపాదించిన 'మావిగన్' (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) రాజధాని కేవలం రూ. 10 వేల కోట్లతో అద్భుతమైన మౌలిక వసతులతో సాధ్యమవుతుందని, కానీ చంద్రబాబు తన స్కాముల కోసం రూ. 2 లక్షల కోట్ల వ్యయం అయ్యే అమరావతి భ్రమలను ప్రజలపై రుద్దుతున్నారని ఆక్షేపించారు. అమరావతిలో ఎకరం రూ. 10 కోట్లు పలుకుతుందని మంత్రి నారాయణ అబద్ధాలు చెబుతున్నారని, స్వయంగా చంద్రబాబు కొన్న ఇంటి స్థలమే ఎకరం రూ. 3.63 కోట్లు ఉంటే ప్రజలను ఎలా మోసం చేస్తారని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి కనీస బాధ్యతలను విస్మరించి, రాష్ట్ర వనరులను అమరావతి పేరుతో తాకట్టు పెడుతున్న చంద్రబాబు మోసాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని పేర్ని నాని హెచ్చరించారు.

చంద్రబునాయుడు ఈ రెండేళ్లకాలంలో దాదాపుగా రూ.3.57లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఇంత డబ్బు తెచ్చికూడా సంక్షేమం సంతకెళ్లింది. అభివృద్ధి అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లు, కరెంటు, నీళ్లు, డ్రైనేజీ లాంటి సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు పెట్టే స్తోమత రాష్ట్రానికి ఉందా? లేదు కాదు, పెడతాం అని ఎక్కడిపడితే, అక్కడ అప్పులు చేసి, సాధ్యంకాని, ప్రాక్టికల్ కాని అమరావతి మీద పడితే, ప్రజల పట్ల రాష్ట్రం నిర్వర్తించాల్సిన బాధ్యతల సంగతి ఏంటని ప్రశ్నించారు.

ఫీజు రియింబర్స్ మెంట్ లేక ప్రజలు చదువులు మానేస్తున్న పరిస్థితి. ఈ 2026-27 ఆర్థిక సంవత్సరంతో కలుపుకుని చేయాల్సిన ఖర్చు, గత బకాయిలు రెండూ కలిపితే, రూ.10వేల కోట్లు ఇవ్వాలి. ఇప్పటివరకూ దిక్కూ మొక్కూ లేదు. అసెంబ్లీ సమావేశాలకు ముందు లోకేష్ బి.ఆర్.కాపీలు చూపుతూ రూ.1200 కోట్లు ఇస్తున్నామని ట్వీట్ చేశాడు. ఇప్పటికీ పూర్తిగా ఇవ్వలేదు. మరి ఇలాంటి బాధ్యతల సంగతి ఏంటి?

ఆరోగ్య శ్రీ పూర్తిగా పడకేసింది. దాదాపు రూ.3,200 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాలి. డబ్బులకోసం ఆస్పత్రులు రోడ్డెక్కుతున్నారు. సేవలన్నీ మందగించాయి.  ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కొట్టుకుపోయింది. లోకేష్కు తన ట్వీట్ల ద్వారా ప్రజలందర్నీ ఆదుకుంటున్నట్టుగా ప్రచారం చేసుకుంటూ బిల్డప్లు ఇస్తున్నారు. చివరకు ఆ CMRF డబ్బులు కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పేద రోగుల నుంచి దోచేసుకుంటున్నారు. మా పథకాలన్నీ రద్దై పోయాయి.  ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కూడా లేదు. ఆడ బిడ్డ నిధికింద నెలకు రూ.1500 ఇస్తానన్నారు. దానికి అతీగతీ లేదు. యాభై ఏళ్లు దాటితే నెలకు రూ.4వేల పెన్షన్ ఇస్తానన్నారు. దానికీ గతిలేదు. 
నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేలు అన్నారు. ఇప్పటికి ఒక్క రూపాయి లేదు. నిరుద్యోగం తీవ్రంగా ఉంది. స్కూళ్లలో నాడు – నేడు ఆపేశారు. ఆస్పత్రుల్లో నాడు-నేడు ఆపేశారు. ఆస్పత్రుల్లో మందులకు, దూదికీ దిక్కులేదు. కాస్త పెడితే మెడికల్ కాలేజీలు అయిపోతాయి. వాటినికూడా ప్రైవేటుకు అప్పగించేస్తున్నారు. చివరకు మత్స్యకారులకోసం మేం కట్టిన ఫిషింగ్ హార్బర్లుకూడా పూర్తైన వాటిని, వారికి అప్పగించకుండా, ప్రైవేటు వారికి అమ్మేస్తున్నారు. మేం ప్రారంభించిన మూడు ప్రభుత్వ పోర్టుల్లో పనులన్నీ మూలన పడేస్తున్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పనులెన్నో ఉన్నా, తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన కార్యక్రమాలు ఉన్నా.. వాటన్నింటినీ చంద్రబాబు మూలనపడేసి. అమరావతిమీద పడ్డాడు. కారణం, అమరావతి పేరిట స్కాంలు, వాటి ద్వారా చంద్రబాబుకు వస్తున్న ఆదాయాలు. అంటే సాధ్యంకాదని తెలిసి, మీ స్కాములకోసం భ్రమ కల్పిస్తున్న మాట వాస్తవమా? కాదా?అసలు రాష్ట్రానికి కేపిటల్ అనేది లేకుండా చేస్తున్నమాట వాస్తవమా? కాదా?

చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు, అంతులేని అవినీతి, అత్యాశల కారణంగా అమరావతి అనేది రాష్ట్రానికి మోయలేని గుదిబండగా మారింది. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారని వైయస్ జగన్ గారు అద్భుతంగా వివరించారని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని మావిగన్ పేరుతో రాజధానిగా అభివృద్ధి చేయాలని వైయస్ జగన్ గారు ప్రతిపాదిస్తే, దాన్ని ఎందుకు అంగీకరించడంలేదో చెప్పకుండా, లెక్కలతో వివరించకుండా తన మంత్రులు, ఎమ్మెల్యేలకు బూతు పాఠాలు రాసిచ్చి వారితో మాట్లాడిస్తున్నాడు. మంత్రులుగా ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన అచ్చెన్నాయుడు, అనిత, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సవితలతోపాటు ఎమ్మెల్యే ధూళిపాళ్ల, ఎంపీ కలిశెట్టి, టీడీపీ నాయకుడు పట్టాభి వంటి వారిని వైయస్ జగన్ గారి మీదకు ఉసిగొల్పి బూతులు, అసత్యాలతో వ్యక్తిత్వ హననం చేయడమే పనిగా పెట్టుకున్నారు. వీళ్లంతా మావిగన్ పై చర్చ జరగకుండా జగన్ గారిని ట్రోల్ చేశామని సంబరపడిన 48 గంటల్లోపై వారి ఆశలు ఆవిరైపోయాయి. మంత్రి అచ్చెన్నాయుడు చంద్రబాబుకి బూతు బంట్రోతుగా మారిపోయాడు. 

- వీళ్లంతా చంద్రబాబుని ఎంత ఘోరంగా తిట్టారో...

కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉండి ధర్మాన ప్రసాదరావు గారు, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు తీసుకొచ్చి వైయస్ జగన్ గారి వ్యక్తిత్వం గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారం మొదలు పెట్టాడు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ గారు చంద్రబాబుని ఘోరాతి ఘోరంగా తిట్టాడు. గోడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం, అభినవ ఔరంగజేబు చంద్రబాబు, పశువుకున్న విశ్వాసం కూడా చంద్రబాబుకి లేదని విమర్శించాడు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తన వైపు లాక్కున్నడని చెప్పాడు. నా మీద పోటీచేస్తానని ప్రగల్భాలు పలికి నా ప్రభంజనంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు.. నమ్మించి ముంచిన నంగనాచి, బాబు నా కన్నా పెద్ద నటుడు, 73 ఏళ్ల వయసులో ఆయన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఆయన తిట్టిన తిట్లకు ఇంకెవరన్నా అయితే ఏదైనా అఘాయిత్యం చేసుకునేవాళ్లు. ఇవన్నీ ఎంపీ కలిశెట్టి మీడియాలో చూపించాలి. చంద్రబాబు ఊసరవెళ్లి, వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం, మళ్లీ అదికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని ఆయన వద్ద ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న  వాళ్లే అన్నారు. ఇప్పుడు చంద్రబాబుకి పార్టనర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం నాడు చంద్రబాబు, లోకేష్ ల అవినీతిని తీవ్రంగా విమర్శించారు. బాబు మళ్లీ సీఎం అయితే అవినీతిని ప్రోత్సహించినట్టే అన్నాడు. చంద్రబాబు కేబినెట్లో ఉన్న సగం మంది మంత్రులు ఒకప్పుడు ఆయన్ను తిట్టిన వీడియోలు చాలా ఉన్నాయి. 164 మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబుని తిట్టిన వారి లెక్క వందకి పైనే. చంద్రబాబుని మోడీ, మోడీని చంద్రబాబు దూషించుకున్నారు. చంద్రబాబుని దగ్గుబాటు పురందీశ్వరి ఎన్నిసార్లు తిట్టిందో లెక్కే లేదు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా చంద్రబాబు గురించి పుస్తకాలే రాశాడు. టార్చ్లైట్ మినిస్టర్ అని పేరు కూడా పెట్టాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలను టీడీపీ శిక్షణ తరగతుల్లో పంచి పెట్టగలరా? చంద్రబాబు రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలి. చేయాలి. అప్పుడే అందరికీ మంచిది.

- తనకి ఏ సమస్య వచ్చినా చంద్రబాబు చేసేది డైవర్షనే

ఏ సమస్య వచ్చినా దానికి చంద్రబాబు దగ్గర ఉన్న సమాధానం డైవర్షన్ చేయడమే. కేబినెట్ సమావేశాల్లో పదే పదే వివేకా హత్య కేసు, బాబాయ్- గొడ్డలి, లక్ష కోట్ల అవినీతి, ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ, తిరుమలలో వైయస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదని, రామతీర్థంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదం, జగన్ క్రిస్టియన్.. వంటి విషయాలు పదే పదే మాట్లాడి, మంత్రులనూ మాట్లాడాలని ప్రేరేపిస్తున్నాడు. వైయస్ జగన్ గారు మావిగన్ ప్రతిపాదన తీసుకొస్తే ఎందుకు తిరస్కరిస్తున్నారో చెప్పాల్సిందిపోయి మంత్రులంతా చంద్రబాబు సూచనలతో బూతు పాఠాలు అందుకున్నారు. ఇవన్నీ రికార్డు చేసి భవిష్యత్తులో ఆయనకే వినిపించి చంద్రబాబు చేస్తున్న ఈ దిగజారుడు రాజకీయాలను వివరించే రోజు కూడా సమీప భవిష్యత్తులో తప్పకుండా వస్తుంది. 

- ఈ ప్రాంతాల్లో ఒక్క రూపాయైనా ఖర్చు చేశారా? 

చంద్రబాబు చెప్పే అమరావతి కాన్సెప్టులో బలముంటే మావిగన్ పేరెత్తితే ఎందుకంత భయం? మావిగన్ పేరుతో వైయస్ జగన్ ఈరోజు చెప్పాడు. కానీ సీఆర్డీఏ పరిధిలో ఎప్పుడో ఉందని 30-12-2014 నాటి జీవో చూపిస్తున్నారు. మరి ఎనిమిదేళ్లలో ఈ ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్ ఎందుకు సిద్ధం చేయలేదు?  వైయస్ జగన్ గారు మావిగన్ పేరెత్తే వరకు అమరావతి అంటే 29 ఊర్లే. ఆయన ఎప్పుడైతే మావిగన్ కాన్సెప్టు తీసుకొచ్చారో అప్పుడు హడావుడిగా విజయవాడ రూరల్, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, పమిడిముక్కల, నూజివీడు, గుడివాడ, గన్నవరం, ఉంగుటూరు, పామర్రు, ఘంటసాల, పెదపారపూడి మండలాలకు కన్సల్టెంట్లను పంపించాడు. 51 వేల కోట్లకు టెండర్లు పిలిచామని చెప్పే మంత్రి నారాయణ అందులో ఒక్క కోటి రూపాయలైనా ఈ ఊర్లలో ఎందుకు వెచ్చించలేదు?  మాస్టర్ ప్లాన్ ఇంతవరకు ఎందుకు రూపొందించలేదు?   మా ప్రాంతాల్లో ఒక్క ఆఫీసు ఉందా? ఐదు టవర్లలో ఒక్కటైనా ఉందా? జడ్జి బంగ్లాలు, ఎమ్మెల్యే క్వార్టర్లు లేకుండా మేం రాజధాని పరిధిలో ఉన్నామని ఎలా ఫీలవ్వాలో చెప్పాలి? 8 ఏళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి నారాయణ చెబుతున్నాడు. కానీ అందులో రూ. 5వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులే ఉన్నాయి. 

- ఏ లెక్కన ఎకరం రూ. 10 కోట్లు అంటున్నారు?

జమ్మూ కాశ్మీర్లో నారాయణ కాలేజీ పెట్టిన నారాయణ నష్టమొచ్చిందని ఎలా మూసేస్తున్నాడో, రాష్ట్రానికి అమరావతి గుదిబండగా మారిందని తేలినాక ఆపేస్తేనే భవిష్యత్తు తరాలకు మంచిది. రాజధాని మీద ఇంత అప్పు చేస్తున్నప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఈ అప్పులు ఎక్కడికి చేరుకుంటాయో కనీస అంచనా ప్రభుత్వం వద్ద కూడా లేదు. 2029 నాటికి బేసిక్ కేపిటల్ (సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు) పూర్తి చేస్తామని చెబుతున్నారు. బేసిక్ కేపిటల్కే రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తే, ల్యాండ్ పూలింగ్లో రైతుల నుంచి తీసుకున్న ప్లాట్లు డెవలప్మెంట్కి ఇంకెంత ఖర్చు చేయాలి? ప్రజల నుంచి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేస్తూ ఆ లెక్కలు ప్రజలకు చెప్పాల్సిన పనిలేదా? అమరావతిలో ఒక్కో ఎకరా విలువ రూ.10 కొట్లు ఉందని, భవిష్యత్తులో రూ.20కోట్లకు చేరుతుందని బోగస్ ప్రచారం మొదలుపెట్టారు. వాస్తవం చూస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉంది. చంద్రబాబు తన ఇంటి నిర్మాణం కోసం వెలగపూడి ప్రాంతంలో 25 వేల చదరపు గజాలు(5 ఎకరాలు) గజం రూ.7500 చొప్పున కొనుగోలు చేశాడు. ఆ మొత్తం 5 ఎకరాల స్థలాన్ని ఏడాది క్రితం రూ 18.75 కోట్లకు కొనుగోలు చేసినట్టు సేల్ డీడ్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీనిప్రకారం చంద్రబాబు ఎకరం రూ.3.63 లక్షలకు కొన్నాడు. అది కూడా కొత్తగా నిర్మించబోతున్న సచివాలయానికి ఎదురుగా ఉండే ప్రైమ్ ల్యాండ్. ఇంటి వెనుక హైకోర్టు వస్తుంది. అలాంటిది రూ.10 కోట్లు పలుకుతుందని మంత్రి నారాయణ చెప్పేవన్నీ అబద్ధాలే కదా? ఈ లెక్కన ప్రభుత్వం వద్ద ఉన్న 5వేల ఎకరాలు అమ్మినా వచ్చే ఆదాయం రూ. 18,150 కోట్లు అవుతుంది. ఈ లెక్కలన్నీ వివరిస్తే వైయస్ జగన్ ని తూలనాడుతున్నారు. 4800 గజాల్లో వైయస్ జగన్ గారు తాడేపల్లిలో ఇళ్లు కట్టుకుంటేనే ప్యాలెస్ అంటే, చంద్రబాబుయ ఐదెకరాల్లో కడుతున్న ఇంటిని ఏమనాలి? 

- 20 ఏళ్లపాటు ఏడాదికి రూ. 22 వేల కోట్లు అప్పులు కట్టాలా? 

అమరావతి రాజధాని నిర్మాణానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.1,09,023 కోట్లు కావాలని 2018లో చంద్రబాబు నీతిఆయోగ్కి డీపీఆర్ కూడా పంపాడు. 2018 లెక్కల ప్రకారమే ఈ అంచనా వ్యయం రూ. 1.09 లక్షల కోట్లయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి?  పైగా ఇప్పుడు కొత్తగా మరో 50వేల ఎకరాలు సేరించాలని చెబుతున్నారు. దానికి ఎంత కావాలి?   కేవలం 5 బిల్డింగులు కట్టడానికే రూ. 51 వేల కోట్లు ఖర్చయితే, రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఇంకెంత కావాలి. చంద్రబాబు కొన్న లెక్క ప్రకారం ప్రభుత్వం వద్ద మిగిలిన 5 వేల ఎకరాలు రూ. 18వేల కోట్లకు పోతే మిగిలిన డబ్బంతా ఎక్కడి నుంచి తేవాలి?  ఏడీబీ(ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్) బ్యాంక్ నుంచి 8.25 శాతం వడ్డీతో రూ.15 వేల కోట్లు అప్పు తెచ్చారు. దాన్నే ప్రామాణికంగా తీసుకుంటే ఈ అప్పులకు అసలు వడ్డీ కలిపి ఏడాదికి రూ. 19,500 కోట్ల నుంచి రూ.22 వేల కోట్లు 20 ఏళ్లపాటు కట్టాలి.

ఈ 5వేల ఎకరాలతో ఎలా? అప్పులు తీర్చేదెట్లా? 20 ఏళ్లకు తీరుస్తామని అప్పులు తెస్తున్నారు. వడ్డీ పెరిగితే ఏడాదికి రూ.22 వేల కోట్ల వరకు అసలు, వడ్డీ కలిపి కట్టాలి. 5వేల ఎకరాల సంపదని ఎప్పుడికి అమ్ముతారు? ఈ బాకీ ఎప్పటికి తీరుస్తారు?  ఎన్ని లక్షల కోట్లు అవుతుందో తెలియదు. ఇప్పటికైనా ఇక్కడితో కట్టి పెట్టండి. 
మావిగన్ (మచిలీపట్నం-విజయవాడ- గుంటూరు మధ్యలో) ఎక్కడ ఎకరా రూ.1 కోటి ఇచ్చి కట్టినా రూ.8 నుంచి రూ.10వేల కోట్లతో అద్బుతమైన రాజధాని అవుతుంది. మీరు చెప్పిన లెక్క ప్రకారం విశాలంగా 10 లక్షల చదరపు అడుగుల చొప్పున హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ కూడా కట్టవచ్చు. ఎకరా రూ.100 కోట్లకు వేలంలో పాడి అద్బుతమైన మౌలికసదుపాయాలతో ఇళ్లు పూర్తి చేసి చదరపు అడుగు రూ.10వేలకు అమ్ముతున్నారు. ఇదే విషయం మిమ్మల్ని ప్రశ్నిస్తే వైయస్.జగన్ ను నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. హైదరాబాద్ శంకరపల్లి, కోకాపేట, నియోపోలీస్ ఏరియాలో కూడా ఎస్ ఎఫ్ టీ ఎంత ధర చూస్తే వాస్తవం అర్ధం అవుతుంది. మంత్రి నారాయణ ఇళ్లు, కార్యాలయం ఎక్కడైనా చదరపు అడుగు రూ.16 వేలకు కట్టారా? చంద్రబాబు గారి ఇళ్లైనా అంత ధరకు కట్టారా? దోపిడీకైనా, విలాసాలకైనా అడ్డూ అదుపూ ఉండాలి. ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? 
నేను అగ్రిమెంట్ రాస్తాను. మీరు చెబుతున్నట్టు 10 లక్షల చదరపు అడుగుల చొప్పున సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ కేవలం రూ.10 వేల కోట్లలో కట్టి చూపిస్తాం. 
కేంద్రమంత్రి పెమ్మసాని మాటల్లోనే అక్కడ లక్ష జనాభా లేరని, హోటల్ కట్టినా ఎవరూ రారని చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు మాత్రం 2035 నాటికి 50 లక్షల జనాభా అవుతుందని చెబుతున్నారు. ఎంత మోసం? అమరావతి బిల్లు మీరు పెట్టినప్పుడు చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మిగిలిన ప్రాంతాల ప్రజలను మభ్యపెట్టడానికి ఏయే జిల్లాలకు ఏం చేయబోతున్నాడన్నది హామీ ఇచ్చాడు.  
అనంతపురం కరువు నివారణకు 100 శాతం డ్రిప్, ఉద్యాన యూనివర్సిటీ, ఎయిమ్స్ కు అనుబంధంగా ఆసుపత్రి, నూతన పారిశ్రామిక నగరం, హిందూపూర్ లో స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ పార్కు, పుడ్ పార్కు, ఎలక్ట్రానిక్, హార్జ్ వేర్ క్లస్టర్, సోలార్ మరియు విండ్ పవర్ ప్లాంట్, పెనుగొండలో ఇస్కాన్ ప్రాజెక్టు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆధ్యాత్మిక నగరంగా పుట్టపర్తి, ఎయిర్ పోర్ట్ నిర్వహణ,అనంతపురంలో విమాన మరమ్మత్తుల కేంద్రం, హంద్రీనీవా ప్రాజెక్టు, స్టీల్ ప్లాంటు ఇవన్నీ అనంతపురం జిల్లాకే చేస్తామన్నాడు. ఇందులో ఒక్కదానికైనా శంకుస్థాపన చేశారా చంద్రబాబూ? ఒక్క రూపాయి అయినా కేటాయించారా?

- మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఆలోచించండి. 

ఇన్ని మాటలు చెబుతున్నారు కదా, ఏ రోజైనా వెస్ట్రన్ బైపాస్ ఆలోచన చేశారా? అది రాకపోగా  కాజా టోల్ గేట్ విజయవాడ, మచిలీపట్నం హైవే మీదుగా ప్రస్తుతం  వెస్ట్రన్ బైపాస్ ప్రారంభమైన మెడికల్ కాలేజీ వరకు .. వైయస్.జగన్ ఈస్ట్రన్ బైపాస్  అనుమతులు సాధించి తీసుకొస్తే.. అవుటర్ రింగ్ రోడ్డు పేరుతో దాన్ని కూడా రద్దు చేశారు. ఈ అవుటర్ రింగ్ రోడ్డు ఎప్పటికి అవుతుంది? రాజధాని లోపలకి వెళ్లడానికి రోడ్డే ఇంతవరకు పూర్తి కాలేదు. మీరు అధికారంలోకి వచ్చి 24 మాసాలైంది. ఈ 5వేల ఎకరాలతో అమరావతి పేరుతో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి  తీసుకొస్తున్న అప్పు ఎవరు కడతారు? ధర ఎక్కడుంది? చంద్రబాబు ఇంటి డాక్యుమెంటు ఆధారంగా తీసుకున్నా గజం రూ.7500 అంటే ఎకరం రూ.3.63 కోట్లు మాత్రమే ఉంది. అది కూడా చంద్రబాబు ఇంటికి ఒకవైపు సచివాలయం మరోవైపు హైకోర్టు ఉంటేనే ఈ ధర ఉంటే.. అమరావతి మారుమూల ప్రాంతాల్లో ఎంత రేటు ఉంటుంది? 

జనం లేరని అమరావతి గురించి కేంద్రమంత్రి పెమ్మసానే చెబుతున్నాడు. అలాంటప్పుడు వైయస్.జగన్ చెప్పిన మావిగన్ ప్రతిపాదన తప్పేంటి? ఈ అప్పులన్నీ చేయకుండా ఓ రూ.10 వేల కోట్లతో రాజధాని నిర్మాణం చేస్తే ఏం ప్రమాదం ఉంది? సంపాదన లేకుండా అప్పులతో ఉంటే చంద్రబాబు హైదరాబాద్ తరహాలో పెద్ద ఇళ్లు కడితే జనం హర్షిస్తారా? మొహాన ఉమ్మేస్తారు.  మీకు అయితే ఒక న్యాయం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో న్యాయమా?

ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ కి  ఎవరు డబ్బులు కట్టారో చెప్పకుండా విమానంలో వెళ్లి మ్యాచ్ చూసి రావడం గొప్పకాదు లోకేష్ నాయుడు... ఫీజు రీయింబర్స్ మెంట్ నయాపైసలతో కట్టి మాట్లాడండి. రాష్ట్రంలో అలో లక్ష్మణా అని జనం ఏడుస్తుంటే.. ఆరోగ్యశ్రీ లేక ప్రజలు అల్లాడుతుంటే మీరు మాత్రం విలాసాలు చేస్తుంటారు.  భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వడం లేదు, కొత్త పెన్షన్ లేవీ లేవని మీ స్పీకరే స్పష్టంగా చెబుతున్నాడు. 
పంట నష్ట పరిహారం ఇస్తున్నారా లేదా అని మీ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడిగితే స్పష్టంగా సమాధానం చెప్పలేరు కానీ.. వైయస్.జగన్ మీద మాత్రం విమర్శించడానికి ముందుంటారు. రైతులును ఏడిపిస్తున్నారు. నిరుద్యోగభృతి రూ.3వేలు ఎవరికి ఇచ్చారు. పోర్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం నిలిచిపోయింది. మచిలీపట్నం పనులు ఎందుకు నత్తనడకన నడుస్తున్నాయి. డబ్బులున్నా మూలపేట పోర్టు పనులు ఎందుకు నిలిచిపోయాయి. కారణం అమరావతి పేరుతో చేస్తున్న అప్పులు కారణంగా అన్ని పనులను నిలిపివేశారు. అమరావతిలో బ్లాక్ 1 తప్ప ఎక్కడ లిప్టులు కూడా పనిచేయవు. ఉన్న అసెంబ్లీని బాగుచేయవచ్చు. అందరినీ తాకట్టు పెట్టి లక్ష కోట్లు అప్పు చేస్తే ఇది ఎప్పటికీ తీరేది కాదు.  

మీ తప్పడు ఆలోచనలు మానండి. బూతులు తిట్టడం ఆపండి. మీకు దమ్ముంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు అమరావతికి పోల్చండి. అంతే తప్ప వైస్.జగన్ ను బూతులు తిడితే ఏం వస్తుంది. రాష్ట్ర ప్రజలకు విచక్షణ లేదనుకోకండి. ఇప్పటికైనా వైయస్.జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉంటే బదులివ్వండి. ఎప్పటికి అమరావతిని పూర్తి చేస్తారు?  రైతులకు ప్లాట్లు ఎప్పుడిస్తారు? రోడ్లు ఎప్పుడు వేస్తారు? అప్పు ఎంత చేస్తారు? ఎలా అప్పు తీరుస్తారు? మీ దగ్గరున్న 5 వేల ఎకరాలతో అప్పు ఎలా తీరుస్తారు? వీటికి సమాధానం చెప్పే దైర్యం లేక వైయస్.జగన్ ప్రజల తరపున అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. లేదంటే అమరావతిని స్లో డౌన్  చేసుకుని రాష్రాన్ని అప్పులు ఊబిలోకి కూరుకుపోకుండా ఆపాలని డిమాండ్ చేస్తున్నాం.

- అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ... 

మంత్రి నారాయణ వైజాగ్ లో రాజధాని అన్నా కూడా అక్కడ ఓడిపోయామని చెబుతున్నారు. చంద్రబాబు 2019 ఎన్నికల నాటికి అన్ని నదుల నీటిని, అన్ని ప్రాంతాల మట్టిని తెచ్చి రాజధాని నిర్మాణం అని చెప్పారు. తాత్కాలికం అని చెప్పి కొన్ని భవనాలు కట్టారు. మరి అలాంటప్పుడు తాటికొండ, మంగళగిరి, పెదకూరపాడులో ఎందుకు తుడిసిపెట్టుకుని పోయారు? రేపు 2029లో కూడా ఎన్ని మోసాలు చేసినా రాజధాని పేరుతో రైతులను కాల్చుకు తిని ఏడిపించినా... ఈ ప్రాంతాల్లో డీ లిమిటేషన్ అయి ముక్కలైనా మీ మాడు పగలడం ఖాయమని హెచ్చరించారు.  అమరావతి పై  పార్లమెంటులో చట్టం చేస్తే లోకేష్ గ్యాలరీ నుంచి చప్పట్లు కొట్టి సంబరాలు చేసుకున్నారు తప్ప అమరావతిలో 29 గ్రామాల ప్రజలు ఎవరైనా సంబరాలు చేసుకున్నారా? మీరిచ్చిన పిలుపు మేరకు ఎవరైనా దీపాలు పెట్టారా? నీ ఎల్లో చానెల్స్ వెళ్లి బ్రతిమాలినా రాజధానికి భూములిచ్చిన రైతులు బయటకు రాలేదు. అంటే వారికే తమకు మేలు జరుగుతుందని భావన లేదు. మిగిలిన రాష్ట్ర ప్రజలందరినీ ఎందుకు బలి చేస్తున్నారు చంద్రబాబు గారూ. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వైయస్.జగన్ మావిగన్ అన్న తర్వాత ఆ పేరు తప్ప మిగిలినదంతా కరెక్ట్ గానే చెప్పారని అంగీకరిస్తున్నారు.

Back to Top