ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు ఐడీ కార్డు త‌ప్ప‌నిస‌రి

వైయ‌స్ఆర్‌సీపీ క‌ర్నూలు జిల్లా అధ్య‌క్షుడు ఎస్వీ మోహ‌న్ రెడ్డి

ఐడి కార్డ్ వెరిఫికేషన్ కార్యక్రమంపై క‌ర్నూలులో కీలక సమావేశం 

క‌ర్నూలు:  ప్రతి కార్యకర్త త‌ప్ప‌నిస‌రిగా ఐడీ కార్డు పొందాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి, వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు ఐడీ కార్డులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పార్టీ కార్యకర్తలు తమ వివరాలను సరిచూసుకుని వెంటనే ఐడీ కార్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసి, ప్రతి స్థాయిలో సమన్వయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, గుర్తింపు, సమన్వయం కోసం ఐడీ కార్డులు అవసరమని పేర్కొంటూ, ప్రతి కార్యకర్త బాధ్యతగా ముందుకు రావాలని ఎస్వీ మోహన్ రెడ్డి కోరారు.

కర్నూలులో పార్టీ కార్యాలయంలో ఐడి కార్డ్ వెరిఫికేషన్ కార్యక్రమంపై ముఖ్య సమావేశం నిర్వహించారు. ఎస్వీ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో కర్నూల్ అబ్జర్వర్ చల్ల విజ్ఞేశ్వర రెడ్డి సహా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త తన ఐడి కార్డ్ వివరాలను జాగ్రత్తగా పరిశీలించి వెంటనే వెరిఫికేషన్ పూర్తి చేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి ఐడి కార్డులు కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఐడి కార్డ్ వెరిఫికేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని, అన్ని స్థాయిల్లో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని సంకల్పం వ్యక్తం చేశారు.

 

Back to Top