తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలి 

విజ‌య‌వాడ‌లో వైయస్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో భారీ ర్యాలీ

విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 21వ డివిజన్‌లో తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని వైయస్ఆర్‌సీపీ ఆందోళనకు దిగింది. ఎన్‌ఎస్‌ఎం స్కూల్‌ నుంచి సర్కిల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో పెద్ద ఎత్తున వృద్ధులు పాల్గొన్నారు. రెండేళ్లుగా కొత్త పింఛన్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేయడం లేదు.. పాత పింఛన్లు సైతం తొలగించింది. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, వైయస్ఆర్‌సీపీ  కార్యకర్తలు పాల్గొన్నారు.

 తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలి 

విజ‌య‌వాడ‌లో వైయస్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో భారీ ర్యాలీ

  విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 21వ డివిజన్‌లో తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని వైయస్ఆర్‌సీపీ ఆందోళనకు దిగింది. ఎన్‌ఎస్‌ఎం స్కూల్‌ నుంచి సర్కిల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో పెద్ద ఎత్తున వృద్ధులు పాల్గొన్నారు. రెండేళ్లుగా కొత్త పింఛన్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేయడం లేదు.. పాత పింఛన్లు సైతం తొలగించింది. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, వైయస్ఆర్‌సీపీ  కార్యకర్తలు పాల్గొన్నారు. అనంత‌రం ఫించన్లు తొలగింపుపై జోనల్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, “వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ కాలంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్లు అందించాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హత ఉన్నవారికీ ఫించన్లు తొలగిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని సరిగా అమలు చేయడం లేదు” అని విమర్శించారు. మహిళలకు వైయస్ జగన్ ప్రాధాన్యత ఇచ్చారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం వారిని మోసం చేసిందని ఆరోపించారు.
అలాగే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌పై కూడా ఆయన ప్రశ్నలు గుప్పించారు. “వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ఏ చిన్న విషయానికైనా గగ్గోలు పెట్టిన గద్దెకు ఇప్పుడు ప్రజల సమస్యలు కనిపించడం లేదా?” అని నిలదీశారు. ప్రభుత్వం కేవలం ప్రచార కార్యక్రమాలకే పరిమితమైందని, అసలు అమలులో మాత్రం పూర్తిగా విఫలమైందని అన్నారు.

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వంలో అన్ని రకాల ఫించన్లు తగ్గిపోయాయి. జగన్ హయాంలో సంఖ్య పెరిగింది. ఇప్పుడు పెంచుతున్నామని చెప్పడం కేవలం ప్రచార ఆర్భాటమే తప్ప అమలు లేదు” అని అన్నారు. దివ్యాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 50 ఏళ్లు దాటిన వారికి ఫించన్లు ఇస్తామని ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. “సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం అనేది పూర్తిగా అబద్ధం” అని స్పష్టం చేశారు.

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, “విజయవాడలో తొలగించిన ఫించన్లు వెంటనే పునరుద్ధరించాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. జగన్ నవరత్నాల ద్వారా వాస్తవంగా ప్రజలకు ప్రయోజనం కలిగించారు. నాలుగేళ్లలో 33 లక్షల కొత్త ఫించన్లు మంజూరు చేశారు” అని గుర్తుచేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఫించన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  మీ పత్రికలే వాస్తవాలు చెబుతున్నా కూడా చంద్రబాబుకు చలనం లేదు” అని విమర్శించారు. విజయవాడలో ప్రభుత్వ శాఖలు ప్రజల విశ్వాసం కోల్పోయాయని, ఇసుక, బూడిద, మట్టి వంటి వనరులను కూటమి నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్లు పునరుద్ధరించాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 

Back to Top