రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు పరామర్శ  

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా: పాలకొండ మండలం జంపరకోట, సీతంపేట సమీపాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పరామర్శించారు. డోలమడ గ్రామానికి చెందిన అక్కుపల్లి రమణ, జంపరకోట గ్రామానికి చెందిన ఆరిక ఆదిలక్ష్మి, కొండగొర్రి శ్రావణి, ఉర్లక శాంతి, జీలకర్ర మోహన్ రావు కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే మేడకోట రోడ్డుపై రక్షణ గోడ (ప్రొటెక్షన్ వాల్) ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రమాద ఘటనను మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. 
 

Back to Top