పులివెందులలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు 

వైయ‌స్ఆర్ జిల్లా: పులివెందుల పట్టణంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత వైఎస్ మధు రెడ్డి పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వరప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిషోర్, ఎస్సీ నాయకులు కోళ్ల భాస్కర్, సూరి, మూర్తి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడుచుకుంటూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.
 

Back to Top