తాడేపల్లి: వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం. చిత్తూరులో పార్టీ కార్యకర్తను అరెస్టు చేసి గంట కూడా గడవక ముందే తాడేపల్లిలో పూడి శ్రీహరిని అరెస్టు చేశారు. ఈలోపు పోలీసులు ఆ వ్యక్తిని ఎక్కడ విచారణ చేశారు? ఎలాంటి ఆధారాలు సేకరించారు? రాప్తాడు నుంచి కనీసం 15 గంటల సమయం ప్రయాణించి రావాల్సిన పోలీసులు గంటల వ్యవధిలోనే పూడి శ్రీహరిని తాడేపల్లిలో ఎలా అరెస్ట్ చేస్తారు? శ్రీహరిని అరెస్ట్ చేయడం కోసం ముందు రోజు నుంచే పోలీసులు ఆయన ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించడంతో పాటు, సిగ్గు లేకుండా అక్రమ అరెస్టును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్‌గారు అక్కడ పర్యటనకు వెళ్లడంతో దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే పూడి శ్రీహరిని అక్రమ అరెస్టు చేశారని సుధాకర్‌బాబు తేల్చి చెప్పారు.