తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రిగా విజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపధ్యంలో ఆయన అభినందనలు తెలియజేశారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయ్ సమర్థవంతమైన, పారదర్శకమైన ప్రజాపాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. తమిళనాడు ప్రజలు విజయ్ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారని పేర్కొన్న ఆయన, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలని కోరుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి, సమగ్ర పాలన, ప్రజా సంక్షేమం దిశగా ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు. అలాగే విజయ్ నాయకత్వంలో తమిళనాడు దేశ అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలని, భారత సమగ్ర ప్రగతికి బలమైన భాగస్వామిగా నిలవాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.