తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి బుధవారం ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల తనపై టీడీపీ ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులు, విచారణ పేరుతో పోలీసులు వ్యవహరించిన తీరు తదితర అంశాలను ఈ సందర్భంగా వైయస్ జగన్‌కు వివరించారు. తనపై నమోదు చేసిన తప్పుడు కేసులు, విచారణల నేపథ్యంలో ఎదురైన పరిస్థితులను పూడి శ్రీహరి వివరించగా, అలాంటి అక్రమ కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు. చట్టపరంగా వాటిని ధైర్యంగా ఎదుర్కొందామని సూచించారు. ప్రజల పక్షాన, ప్రజల తరఫున పోరాటం చేసే వారిపై ఇలాంటి వేధింపులు, ఆటంకాలు సర్వసాధారణమని పేర్కొన్న వైయస్ జగన్.. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు అండగా నిలుస్తూ ధీటుగా పోరాటం కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.