రక్తదానం చేసిన  కాకాణి పూజిత 

 నెల్లూరు జిల్లా:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 16వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ర‌క్త‌దానం చేశారు. నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సర్వమత ప్రార్ధనలు. మహానేత రాజశేఖర్ రెడ్డి  వర్ధంతి సందర్బంగా వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కాకాణి పూజిత పాల్గొని త‌న ర‌క్తం దానం చేసి స్ఫూర్తిగా నిలిచారు.  

Back to Top