తాడేపల్లి: అధికారం కోసం అబద్ధపు హామీలు ఇవ్వడం.. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం సరైన నిర్ణయం కాదని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఐదేళ్ల మా ప్రభుత్వంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలే ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. శుక్రవారం మంగళగిరిలోని సీకే కన్వేషన్ హాల్‌లో వే2 న్యూస్ నిర్వహించిన కాంక్లేవ్‌లో వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పాల్గొని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విషదపరిచారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ వేదిక ద్వారా ఎండగట్టారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. వైయస్ జగన్ విజన్‌తో ఐదేళ్ల పాలన ‘‘వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజన్ తో ఆలోచిస్తుంది. మా పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విజన్‌తో 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వాన్ని నడిపారు. మా ప్రభుత్వంలో అభివృద్ధిని ప్రజలకు చేరువ చేశాం. మధ్యవర్తులు లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందించాం. విద్యారంగంలో ఇంగ్లీష్ మీడియం, సిబీఎస్ సిలబస్, ఐబీసీ వంటి విప్లవాత్మకమైన సంస్కరణలను వైయస్ జగన్ తీసుకువచ్చారు. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కోసం ప్రభుత్వం ద్వారా డబ్బులు కట్టి విద్యను అందించాం. మా ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్ అడ్మిషన్స్ పెరిగాయి. అమ్మ ఒడి పథకం పేరుతో రూ.15000 తల్లుల ఖాతాలో జమ చేశాం. 16 వేల కోట్ల రూపాయలతో పాఠశాలలు అభివృద్ధి చేశారు. అభివృద్ధిని పరుగులు పెట్టించాం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. రెండేళ్ల పాటు కరోనా మహమ్మారితో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఏమాత్రం నాటి సీఎం వైయస్ జగన్ ఏమాత్రం సాకులు చెప్పకుండా సంక్షేమ, అభివృద్ధిని ఆపలేదు. మూడు సంవత్సరాల్లో రామయ్యపట్నం, రావులపాడు, మచిలీపట్నం, కాకినాడ పోర్టులను మొదలుపెట్టాం అందులో కొన్నిటిని పూర్తి చేశాం. 10 ఫిషింగ్ హార్బర్లను కొత్తగా మొదలు పెట్టాం. 2024 ఎన్నికల్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ వచ్చుంటే సంవత్సర కాలంలోనే మిగిలిన పోర్టులను పూర్తి చేసేవాళ్లం. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఇందులో ఐదు కాలేజీల నిర్మాణాలు పూర్తి చేసి అడ్మిషన్లు కూడా ప్రారంభించాం. ఈ ఐదేళ్లు మా ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే 2029 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అభివృద్ధి చెందేది. లులు మాల్‌తో ఎంప్లాయిమెంట్ ఎలా వస్తుంది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు, పెట్టుబడులు రావాలి. అయితే ఈ పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి, ఎందులో పెట్టాలని ఆలోచించి పాలకులు నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని లక్ష కోట్లతో బూచి ఖలీఫా లాంటి టవర్లు నిర్మిస్తామంటూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. లులు మాల్ వంటి వల్ల ఎంప్లాయిమెంట్ ఎలా వస్తుంది. మా ప్రభుత్వంపై అప్పుల విషయంలో తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీలు ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేశాయి. ఏపీ శ్రీలంక అయిపోయిందంటూ, రూ. 14 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ అబద్ధపు ప్రచారాలు చేశారు. చంద్రబాబు నాయుడు సింగపూరు కంపెనీ లేదా మరొక కంపెనీ వెళ్లిపోయిందని ఒక్క పేరు క్లారిటీగా చెప్పరు. అనుకూల మీడియాతో వైయస్ జగన్‌పై విష ప్రచారం చంద్రబాబు అన అనుకూల మీడియాతో వైయస్ జగన్‌పై విష ప్రచారం చేస్తున్నారు. మా ప్రభుత్వ హయాంలో గడిచిన ఐదు సంవత్సరాలలో ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చాం. కొన్నింటికి పునాదులు వేశాం. శంకుస్థాపనలు కూడా చేశాం. ఇవాళ చంద్రబాబు తెస్తున్న లులు కంపెనీ ఓ ఇండస్ట్రీ కాదు.. వాళ్లు సొంత లాభాల కోసం పనిచేసేవాళ్లు. అలాంటి వాటికి వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రభుత్వం పెట్టడం కరెక్ట్ కాదు. రాజధానిలో ఎవరూ పరిశ్రమలు పెట్టరు. రాజధాని అనేది ఓ అడ్మినిస్ట్రేషన్ కేంద్రం. రాజధానికి వైయస్ జగన్ వ్యతిరేకం కాదు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాజధాని కి వ్యతిరేకం కాదు. ఆయన తాడేపల్లిలో సొంతంగా ఇల్లు నిర్మించుకొని నివాసం చేస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు లక్ష కోట్లు తో రాజధాని ఇన్ఫాస్ట్రక్షన్ అవుతుందని చెప్పారు. చంద్రబాబు రాజధాని విషయంలో కలలు కనడంలో తప్పులేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాజధాని అభివృద్ధి చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు. ఇప్పటికే చంద్రబాబు రాజధాని కోసం లక్ష కోట్లు అప్పు చేశారు. లక్ష కోట్లకు సంవత్సరానికి రూ.6 వేల నుంచి రూ. 7000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంత..? ఖర్చు ఎంత తెలియకుండా అప్పులు చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి. రాజధాని నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చడానికి రాజధాని భూములు అమ్ముతామని కూటమి నేతలు చెబుతున్నారు. ఎకరా రూ. 20 కోట్ల ధర అంటే కొనేవారు వస్తారా?. వైయస్ జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తీసుకున్న నిర్ణయంలో అమరావతి ప్రాంతం కూడా ఉంది. ఈ విషయంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డిని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నాడు వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాని మరోచోట రాజధాని నిర్మాణం చేయాలని అనుకోలేదు. మూడు రాజధానిలు నిర్మించడం వల్ల నిర్మాణం ఖర్చు తగ్గుతుంది..అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. రాజధానిలలో కొత్త నిర్మాణాలు అక్కర్లేదు. అమరావతి నుంచే పాలన కొనసాగించాం మా ప్రభుత్వంలో రాజధాని అయిన అమరావతి నుంచే పరిపాలన కొనసాగించాం. చంద్రబాబు నాయుడు నివాసముండే కరకట్ట రోడ్డు నిర్మాణాలు కూడా మా ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశాం. వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే గుంటూరు- విజయవాడ మధ్య అభివృద్ధి జరిగింది. మా ప్రభుత్వంలోనే విజయవాడ ఫ్లైఓవర్ పూర్తయింది. కృష్ణానది రిటైనర్ వాల్ మా ప్రభుత్వంలోనే నిర్మించి పూర్తి చేశాం. నాలుగు బిల్డింగుల ఐకానిక్ టవర్ నిర్మిస్తామని చంద్రబాబు అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ వస్తే రాజధాని రైతులకు న్యాయం చేసేలా వారి అభివృద్ధికి తోడ్పడుతారు. మా కార్యకర్తలే ఇబ్బందులు పడ్డారు ఐదు సంవత్సరాల మా ప్రభుత్వంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారం కోసం అబద్ధపు హామీలు ఇవ్వడం, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వైయస్ జగన్ ఐదేళ్లు పాలన కొనసాగించారు. ఆయన తీసుకున్న నిర్ణయాలకు మేమంతా కట్టుబడి ఉన్నాం. 15 నెలలకే చంద్రబాబు మోసం చేశాడని ప్రజలకు అర్థమైంది. వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకోవటం లేదు. ప్రభుత్వం రూల్ ఫోర్ సెక్టార్లో ఉండాలని బాగా విశ్వసించే నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రభుత్వ రంగాలను ప్రవేటీకరణ చేస్తామంటే దాన్ని హెచ్చరించడంలో తప్పులేదు. వైయస్ జగన్ పాలనలో ఐదు మెడికల్ కాలేజీలు, ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పూర్తి ప్రజలకు అందుబాటులో ఉంచారు. చంద్రబాబు చేస్తున్న అరాచకాల వల్లే అధికారులు ఇబ్బంది పడుతున్నారు. అందుకనే వాళ్ళను ముందుగా హెచ్చరిస్తున్నాం. మీరు చివరి వరకు ఉండాల్సిన వారు, ఉద్యోగులు దయచేసి తప్పులు చేయొద్దు` అని సజ్జల రామకృష్ణారెడ్డి’’ సూచించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ కామెంట్స్.... పునవ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయం మీద ఆధారపడింది... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు పాలాయి అయిందనటం అవాస్తవం... ఏది మాట్లాడిన రాష్ట్ర ప్రెస్టేజ్ ఏమవుతుందని అంటారు.. ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలు అయిందని మాట్లాడుతారు అప్పుడు ఏమైంది.. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఐదు సంవత్సరాల మొదటి పరిపాలన తర్వాత 35% ఉన్న అగ్రికల్చర్ 5% పెరిగింది.. 2015 నుండి 2019 వరకు కేంద్రం నుంచి నిధులు 3.7% వచ్చాయి.. 2019 నుండి 2024 వరకు కేంద్రం నుండి వచ్చిన నిధులు 3% మాత్రమే వచ్చాయి.. కేంద్ర నుండి కొన్ని వేల కోట్లల్లు నిధులు 2019 నుండి 24 వరకు తక్కువగా వచ్చే.. 2014 నుండి 2019 వరకు అప్పటి ప్రభుత్వం పరిమితి దాటి 29 వేల కోట్లు అప్పటి ప్రభుత్వం అప్పు చేసింది.. 2019 నుండి 24 వరకు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి సంబంధించి వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేశాం. 2019 నుండి 24 వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే ఈరోజు ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు.. స్కిల్ డెవలప్మెంట్ వల్ల అనేక విధాలుగా ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు.. స్టూడెంట్స్ మీద యువత మీద మేము ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది... ఈ ప్రభుత్వం తీసుకుంటూ నిర్ణయాలు మా ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేస్తుంది.. మూడు లక్షల కోట్లు ఐదు సంవత్సరాలలో మా ప్రభుత్వంలో అప్పు చేస్తే... ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలో రూ.1, 80,000 కోట్లు అప్పు చేసేసింది.. అప్పు చేసిన డబ్బులు ఎక్కడ పెట్టుబడులు పెట్టారని చూస్తే ఎక్కడా స్థిరంగా కనిపించడం లేదు... రాజధాని ఎక్కడైనా కట్టొచ్చు కానీ కొన్ని పద్ధతిలో ఉంటాయి.. ఒక మహా నగరమే కట్టాలని చూస్తే వీలవుతుందా... ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని గురించి మాట్లాడిన ప్రతిసారి మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం అంటూ మొదలుపెడతారు. లక్ష కోట్లతో ఒక నగరం నిర్మించటం మంచిదా లేదా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి చేయటం మంచిదా అని ఆలోచించుకొని డబ్బు ఖర్చు చేయాలి... ఐటి విభాగం అభివృద్ధి చెందడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.. అన్ని విధాల అనుకూలమైనది వైజాగ్ అని తేల్చడం జరిగింది... వ్యవసాయం విద్య అభివృద్ధి చెందాలంటే విజయవాడ గుంటూరు... వెనకబడిన రాయలసీమ ప్రాంతానికి ఇరిగేషన్ ద్వారా నీరు తెచ్చే ప్రయత్నం చేశాం. ల్యాండ్ పోలింగ్ ద్వారా 25 రైతుల వద్ద నుండి 28వేల ఎనిమిది ఎకరాలు భూమిని తీసుకోవడం జరిగింది రాజధాని కోసం భూములు తీసుకున్న ప్రాంతం వరద నీరు వచ్చే ప్రాంతం...