మద్యం ముడుపులు ముట్టలేదని ప్రమాణం చేయగలవా? 

మంత్రి లోకేష్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి స‌వాల్ 

లిక్కర్ ద్వేషిని..  ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నా

ఏసీబీ కోర్టు వద్ద చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన 

విజ‌య‌వాడ‌: మద్యం వ్యాపారం చేయలేదని, మద్యం నుంచి ఒక్క రూపాయి కూడా ముడుపులు ముట్ట‌లేద‌ని, ఎలాంటి ఆదాయం ఆశించలేదని, స్వీకరించలేదని మంత్రి లోకేష్ ఏ దేవాలయంలోనైనా ప్రమాణం చేయగ‌ల‌రా అని..తాను కూడా ప్ర‌మాణం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి స‌వాల్ విసిరారు.  నేనెప్పుడూ లిక్కర్‌ జోలికి పోలేదు. తాగుడు వల్లే మా నాన్న,తమ్ముడు చనిపోయారు. అందుకే నేను లిక్కర్‌ను ద్వేషిస్తా. లిక్కర్‌ను ద్వేషించే నన్ను లిక్కర్‌ కేసులో అరెస్టు చేశారు. కొన్ని పత్రికల్లో ఇష్టానుసారం అసత్యాలు రాస్తున్నారు. 13ఏళ్లుగా వేద పాఠశాల నడుపుతున్నా. ఏ తప్పు చేయకుండా నేను శిక్ష అనుభవిస్తున్నాని ఏసీబీ కోర్టు వద్ద మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.   

చెవిరెడ్డి ఏమ‌న్నారంటే..

  • మనచా వాచా కర్మణా లిక్కర్ జోలికి ఎప్పుడు పోలేదు..లిక్కర్ కేసుతో నాకు సంబంధం లేదు..
  • నేను ఏడో తరగతి చదివేటప్పుడే మా నాన్న తాగుడు వల్ల మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది 
  • ఇదే తాగుడు వాళ్ళ మా నాన్న చనిపోయాడు..
  • తాడుగుతోనే మా తమ్ముడు చనిపోయాడు..
  • లిక్కర్‌ ద్వేషిస్తాను..లిక్కర్ జోలికి పోను..
  • చిన్నప్పటి నుంచి ఇది ఉద్దేశంతో ఉన్నాను
  • లిక్కర్ ని ద్వేషించే నన్ను లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం నాకు బాధేసింది
  • పత్రికల్లో విచచక్షణారహితంగా అసత్యాలు రాస్తున్నారు..
  • 10 శాతం తప్పు చేస్తే.. 90 శాతం క‌ల్పించి రాస్తున్నారు. 
  • ఇలాంటి వార్త‌లు చ‌దివిన‌ప్పుడు మనసుకు బాధేస్తుంది.. 
  • అరెస్టు చేసినందుకు బాధ లేదు.. లిక్కర్ కేసులో అరెస్ట్ చేసినందుకు బాధ‌గా ఉంది..
  • 13 ఏళ్లుగా వేద పాఠశాల నడుపుతున్న.. 160 మంది పిల్లలు చదువుతున్నారు.
  • తాగుడు వ్యాపారం చేస్తే నైతికగా హక్కు కోల్పోతాం.. ఇది ధర్మం కూడా కాదు
  • ప్రతి మనిషి బతకాలంటే ఏదో  ఒక వ్యాపారం చేయాలి.
  • నేను వ్యాపారం చేసుకుంటున్నాను.. లిక్కర్ తో సంబంధం ఉండి ఒక్క రుపాయి పెట్టుబడి పెట్టిన ఆ ఆస్తులు అటాచ్‌మెంట్‌ కాదు స్వాధీనం చేసుకోండి..
  • లిక్కర్ తో సంబంధం లేకుండా మా వ్యాపారం మీద, మా కొడుకు మీద ప‌డ్డారు
  • ఇది న్యాయం కాదు.. దేవుడు ఉన్నాడు..
  • ఏ తప్పు చేయకుండా నేను శిక్ష అనుభవిస్తున్నాను
     
Back to Top