జగ్గంపేటలో వైయ‌స్ఆర్‌సీపీ మండల స్థాయి సమావేశం

 స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

జగ్గంపేట: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ‘వెన్నుపోటు ప్రభుత్వం–వెన్నుపోటు పాలన’కు వ్యతిరేక పోరులో భాగంగా జగ్గంపేట మండల స్థాయి సమావేశం నిర్వహించారు. జగ్గంపేట మండలంలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహం, రాష్ట్ర వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరాంజీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ప్రధానంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై చర్చించారు.

సమావేశంలో జగ్గంపేట మండలం నుంచి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణపై చర్చించి, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు.

 

Back to Top