గుంటూరు: డీఎస్సీలో అక్రమాలపై నిన్న విజయవాడ శాప్ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసనలో పాల్గొన్న గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గడ్డేటి సురేంద్రను మాచవరం పోలీసులు తాడేపల్లిలో అరెస్ట్ చేశారు. సురేంద్రపై మాచవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు వ్యవహరించిన తీరుపై వైయస్ఆర్‌సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సురేంద్రకు గ్యాస్ టాబ్లెట్ ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా తాడేపల్లి సీఐ వీరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి సీఐను ప్రశ్నించారు. అనంతరం అరెస్ట్ అయిన సురేంద్రను దొంతి రెడ్డి వేమారెడ్డి పరామర్శించారు.