వైయ‌స్ఆర్‌సీపీలోకి 50 కుటుంబాల చేరిక

పార్వ‌తీపురం జిల్లా: గుమ్మలక్ష్మీపురం మండలం దిగువమండ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ మూటక లక్ష్మయ్యతో పాటు 50 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన నూతన సభ్యులకు పాముల పుష్పశ్రీవాణి అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణకు ఈ చేరికలు నిదర్శనంగా నిలిచాయని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.

Back to Top