గౌతమ్‌రెడ్డిపై పోలీసుల దాడికి నిరసనగా కోర్టు విధుల బహిష్కరణ

విజయవాడ: నిన్న శాంతియుత ఆందోళనలో పాల్గొన్న వైయ‌స్ఆర్‌సీపీ నేత, అడ్వకేట్ గౌతమ్‌రెడ్డిపై పోలీసులు దాడి చేసినట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. పోలీసుల దాడిలో గాయాలపాలై అస్వస్థతకు గురైన గౌతమ్‌రెడ్డిని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

గౌతమ్‌రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా విజయవాడ బార్‌ అసోసియేషన్ కోర్టు విధులను బహిష్కరించేందుకు పిలుపునిచ్చింది. శాంతియుత ఆందోళనలో పాల్గొన్న న్యాయవాదిపై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు కోర్టు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు.
 

Back to Top