రాజ్యాంగాన్ని, ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ.. చంద్రబాబు సర్కారు చేసిన వికటాట్టహాసం సుప్రీంకోర్టు వేదికగా దేశం అంతా చూసింది.. అరాచకం, దౌర్జన్యం, దాడులు, కుట్రలు, కుతంత్రాలు కలగలిపి ఏకపక్షంగా ఆయా మున్సిపాలిటీలనుకైవశం చేసుకోవడానికి బరితెగించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.. ఈ దాష్టీకానికి ఆయా జిల్లాల ఎస్పీలు దన్నుగా నిలవగా, కలెక్టర్లు ప్రేక్షకపాత్ర పోషించడం కలకలం రేపింది.. రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామ్యం హత్యకుగురైందనడానికి ఈ 19 మున్సిపాల్టీల్లో చోటుచేసుకున్న అరాచకాలే మచ్చుకు నిదర్శనం.. ఇలాంటి దృశ్యాలు వందలకొద్దీ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవ్వడం ప్రత్యక్ష సాక్ష్యం..