సంక్షోభంలోనూ ఈ ప‌బ్లిసిటీ పిచ్చేంటి?

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి కారుమూరి వెంక‌ట్‌రెడ్డి ఫైర్‌

తాడేప‌ల్లి:  రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సంక్షోభంలో చిక్కుకొని ఉంటే..కూట‌మి నేత‌లకు ప‌బ్లిసిటీ పిచ్చి ప‌ట్టింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి కారుమూరి వెంక‌ట్‌రెడ్డి మండిప‌డ్డారు. రైతుల‌కు ఒక బ‌స్తా యూరియా అందించ‌లేరు కానీ నేపాల్లో చిక్కుకున్న వారిని ఫ్లైట్లో తీసుకువ‌చ్చామంటూ మంత్రి నారా లోకేష్ చేసుకుంటున్న‌ ప‌బ్లిసిటీని ఆయ‌న ఎండ‌గ‌ట్టారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా మాద్య‌మంలో కారుమూరి వెంక‌ట్‌రెడ్డి ఓ వీడియో పోస్టు చేశారు. అందులో ఆయ‌న ఏమ‌న్నారంటే..`వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో గుజ‌రాత్‌లో మ‌న రాష్ట్రానికి చెందిన‌ 3, 833 మంది వ‌ల‌స కార్మికుల‌ను లాక్‌డౌన్ టైమ్‌లో ఏపీకి ప్ర‌త్యేక వాహ‌నాల్లో తీసుకువ‌చ్చారు. ఆ స‌మ‌యంలో వేరువేరు దేశాల‌లో చిక్కుక్కున్న చాలా మంది ఏపీ వాసుల‌ను తిరిగి తీసుకువ‌చ్చారు.  వైయ‌స్ జ‌గ‌న్  సంక్షోభ స‌మ‌యంలో  స‌మ‌ర్థ‌త‌ చాటుకున్నారు.. కానీ ఇలాంటి ప‌బ్లిసిటీ ఎప్పుడూ  చేసుకోలేదు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌జ‌ల‌కు చేసింది ఏమీ లేదు కాబ‌ట్టి ..ఉత్త‌ర కుమార ప్ర‌గ‌ల్బాల‌తో ఇలాంటి స్వ డ‌బ్బా, ప‌ర డ‌బ్బా, ప‌ర‌స్ప‌ర డ‌బ్బాతో ప‌బ్లిసిటీ చేసుకుంటున్నారు` అంటూ వెంక‌ట్‌రెడ్డి విమ‌ర్శించారు.

Back to Top